SSMB29: పైసా ఖర్చు లేకుండా ఓ పనైపోయింది
ఈ కాంబో సెట్ అయిందని తెలిసినప్పటి నుంచి, ప్రతి చిన్న అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.;
ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏదైనా ఉందా అంటే, అది కచ్చితంగా రాజమౌళి మహేష్ బాబు (SSMB29) అనే చెప్పాలి. 'RRR'తో గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన జక్కన్న, 'ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్' మహేష్ బాబుతో చేతులు కలిపితే ఎలా ఉంటుందో చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు అంతకుమించి అనేలా ఉన్నాయి.
ఈ కాంబో సెట్ అయిందని తెలిసినప్పటి నుంచి, ప్రతి చిన్న అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబుకు ఉన్న క్లాస్ ఇమేజ్, రాజమౌళికి ఉన్న మాస్ పల్స్.. ఈ రెండూ కలిస్తే ఆడియన్స్‌కు ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారనే దాని మీదే డిస్కషన్ అంతా నడుస్తోంది. ఇలాంటి 'డ్రీమ్ ప్రాజెక్ట్' నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా, అది నేషనల్ ట్రెండింగ్ అవ్వడం ఖాయం.
అయితే, ఇంత భారీ ప్రాజెక్ట్‌కు అనౌన్స్‌మెంట్ ఎలా ఉండాలి? సింపుల్‌గా ఒక పోస్టర్ వదలొచ్చా.. లేక ఒక ట్వీట్ వేస్తే సరిపోతుందా? అనే ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తున్నారు. అక్కడే రాజమౌళి తన మార్క్ 'బిజినెస్ మైండ్' చూపించాడు. ఇది రెగ్యులర్ అప్‌డేట్ కాదు, ఇది ఒక "ఫస్ట్ రివీల్ ఈవెంట్". నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో లక్షలాది మంది ఫ్యాన్స్ మధ్య ఈ ఈవెంట్‌ను ఒక 'లైవ్ స్పోర్టింగ్ ఈవెంట్' రేంజ్‌లో ప్లాన్ చేశారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లైవ్ టెలికాస్ట్ చేసే హక్కుల కోసం పెద్ద పోటీనే నడిచిందట. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లు ఉన్నా, జక్కన్న టీమ్ చాలా తెలివిగా 'జియో హాట్‌స్టార్'ను సెలెక్ట్ చేసింది. హాట్‌స్టార్ కూడా పోటీ పడి మరీ ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
అలాగే అసలు ప్లాన్ ఇక్కడే వర్కౌట్ అయింది. హాట్‌స్టార్‌ను ఎందుకు సెలెక్ట్ చేశారంటే.. ఇండియాలో 'లైవ్' కంటెంట్‌కు, ముఖ్యంగా 'క్రికెట్'కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నది వాళ్లే. ఇప్పుడు ఈవెంట్ హక్కులు కొన్నది హాట్‌స్టార్ కాబట్టి, ఆ ఈవెంట్‌ను వాళ్ల ప్లాట్‌ఫామ్‌లో భారీ స్థాయిలో సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్లదే.
అందుకే, తమ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం లాంటి లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను వాడుకుంటున్నారు. నిన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్, ఇప్పుడు జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. ఇలా కోట్లాది మంది చూసే ప్రతి లైవ్ మ్యాచ్ మధ్యలో, హాట్‌స్టార్ సంస్థ SSMB29 ఈవెంట్ ప్రోమోలను దంచి కొడుతోంది. దీనివల్ల హాట్‌స్టార్‌కు తమ ఈవెంట్‌కు హైప్ వస్తుంది, యాప్‌కు డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో, రాజమౌళికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, కోట్లకు కోట్లు విలువ చేసే ప్రైమ్ టైమ్ పబ్లిసిటీ అని చెప్పవచ్చు.