రాజమౌళిని చూసి అందరూ సినిమాను నాశనం చేస్తున్నారా?

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.;

Update: 2025-08-01 03:46 GMT

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. బాహుబలి-1,2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో గ్లోబల్ రేంజ్ లో అలరించారు. తన మేకింగ్ అండ్ టేకింగ్ తో ప్రపంచస్థాయిలోని సినీ ప్రియులను ఫుల్ గా మెప్పించారు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అవార్డు కూడా తీసుకొచ్చారు.

తన అప్ కమింగ్ సినిమాలపై అందరి దృష్టి పడేలా చేశారు. అదే సమయంలో తెలుగులో సీక్వెల్స్ సక్సెస్ కావనే నెగిటివ్ బజ్ ను ఒక్కసారిగా రాజమౌళి ఛేంజ్ చేశారనే చెప్పాలి. 2013లో వచ్చిన బాహుబలి(బాహుబలి ది బిగినింగ్) తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ అందరినీ అలరించింది.

ఆ తర్వాత బాహుబలికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి 2 కూడా సూపర్ సక్సెస్ అయింది. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. అంతే కాదు తెలుగులో హిట్ అయిన తొలి సీక్వెల్ మూవీగా కూడా అదే అని చెప్పాలి. అయితే బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ చాలా ఎక్కువ అయిపోయింది. చాలా మంది మేకర్స్ ఫాలో అవుతున్నారు.

రాజమౌళి మాత్రం ఆ ట్రెండ్ ను మాత్రం పక్కన పెట్టారు. ఆర్ఆర్ఆర్ ను ఒక్క మూవీగానే తీసుకొచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. కానీ చాలా మంది మేకర్స్.. పార్ట్-2 కోసం సినిమా స్టోరీ సాగదీస్తున్నారని ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

సినిమా కథ ఒకే పార్టులో చెప్పే అవకాశం ఉంటున్నా కూడా కావాలని సీక్వెల్ కోసం సాగదీస్తున్నారని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకు ఎగ్జాంపుల్ గా పలు సినిమాలు ఉదహరిస్తున్నారు. కేవలం క్రేజ్ కోసమే సినిమా కథనాన్ని అనవసరంగా సాగదీస్తున్నారని చెబుతున్నారు. స్టోరీ లైన్ ను పట్టి లాగుతున్నారని అంటున్నారు.

దీంతో సినిమా కథలు పక్కదారి పడుతున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో ఆడియన్స్ లో ఆసక్తి తగ్గుతుందని, అసంతృప్తి, అసహనం కలుగుతుందని అంటున్నారు. అన్ని చిత్రాలు బాహుబలి కాలేవు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. రాజమౌళి చూసి తమ సినిమాలను నాశనం చేసుకుంటున్నారు కదా అని కామెంట్లు పెడుతున్నారు. అందుకే అనవసరంగా సీక్వెల్స్ వద్దని సూచిస్తున్నారు.

Tags:    

Similar News