ఆ హీరో సింప్లిసిటీ మైండ్ బ్లోయింగ్!
ఓ అద్దె ఇంట్లో నివసిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా `పాలీ హిల్` ప్రాంతంలో గల పూజా కాసా భవనంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు.;
ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ విలాసవంతమైన నివాసం `మన్నత్ `రెన్నోవేషన్ జరగడంతో?
ఓ అద్దె ఇంట్లో నివసిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా `పాలీ హిల్` ప్రాంతంలో గల పూజా కాసా భవనంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అయితే ఈ అద్దె ఇల్లు ఎవరిది? అన్నది ఇంత వరకూ బయటకు రాలేదు. తాజాగా ఆ భవంతి నిర్మాత వసు భగ్నానీ - నటుడు జాక్కీ భగ్నానీదని తేలింది. ఈ విషయాన్ని జాకీ స్వయంగా రివీల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగానే షారుక్ ఖాన్ ఎంత సింపుల్ గా ఉంటారు? అన్నది బయటకు వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ నిజ జీవితంలో అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతారని జాక్కీ చెప్పుకొచ్చారు. గొప్ప స్టార్ అయినా? షారుక్ చుట్టూ ఉన్నవారితో వ్యవహరించే తీరు తనని విస్మయానికి గురి చేసిందన్నారు. `షారుఖ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం మీపైనే దృష్టి పెడతారు. ఎదుటి వారికి ఆయన ఇచ్చే గౌరవం మాటల్లో చెప్పలేం అన్నారు. ముఖ్యంగా అతిథుల పట్ల షారుఖ్ చూపించే ఆదరణ గురించి జాక్కీ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
తనను కలవడానికి వచ్చిన వారు తిరిగి వెళ్లే సమయంలో? షారుఖ్ స్వయంగా వారు ఎక్కే కారు వరకు వచ్చి సాగనంపుతారని తెలిపారు. గ్లోబల్ ఐకాన్ అయి ఉండి కూడా ఇంతటి సంస్కారాన్ని ప్రదర్శించడం షారుక్ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని జాకీ ప్రశంసించారు. షారుఖ్ వ్యక్తిత్వానికి తాను 10కి 11 మార్కులు ఇస్తాననన్నారు. సాధారణంగా సెలబ్రిటీలంటే ఓ రకమైన గర్వం ఉంటుందని భావించే వారికి షారుఖ్ ప్రవర్తన పాఠం లాంటింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాదు. మనుషుల మనసు గెలవడంలో కూడా ఆయన బాద్షా అని నిరూపించుకుంటున్నారు.
యజమానిగా ఉన్న జాక్కీ భగ్నానీనే ఆయనకు వీరాభిమానిగా మారిపోయారంటే. షారుఖ్ వినయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన్నత్ విషయానికి వస్తే? షారుఖ్ ఐకానిక్ బంగ్లాలో అదనపు అంతస్తుల నిర్మాణం -ఆధునీకరణ పనులను భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కావడానికి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు షారుక్ అద్దె ఇంట్లోనే ఉంటారు. ఇందుకోసం షారుక్ నెలకు 24 లక్షల భారీ అద్దెను చెల్లిస్తున్నట్లు సమాచారం. కుటుంబంతో పాటు, వ్యక్తిగత సిబ్బంది సెక్యూరిటీ కోసం ఆయన ఈ భవనంలోని నాలుగు అంతస్తులను వినియోగిస్తున్నారు.