• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'లక్కీ భాస్కర్‌' వీడియో...

'లక్కీ భాస్కర్‌' వీడియో సాంగ్‌.. ఆకట్టుకుంటున్న 'శ్రీమతి గారు'

| "కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" అంటూ తాజాగా వచ్చిన వీడియో సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

By - Tupaki Desk
Update: 2024-10-15 16:45 GMT

మలయాళ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లక్కీ భాస్కర్‌'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ పీరియాడిక్ డ్రామాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని 'శ్రీమతి గారు' వీడియో సాంగ్‌ ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేసారు.

ఆల్రెడీ 'లక్కీ భాస్కర్‌' నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన 'శ్రీమతి గారు' లిరికల్ వీడియో సంగీత ప్రియులను అలరించింది. "కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" అంటూ తాజాగా వచ్చిన వీడియో సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి భార్యా భర్తలుగా కనిపిస్తున్నారు. కథలో భాగంగా వచ్చే ఈ పాటలో హీరోహీరోయిన్ల మధ్య లవ్ స్టోరీని, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడాన్ని, వివాహం తర్వాత వారి జీవితాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని చాలా అందంగా చూపించారు.

'శ్రీమతి గారు' పాటకు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ ను కంపోజ్ చేసారు. సింగర్స్ విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు తమ వాయిస్ తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. గీత రచయిత శ్రీమణి అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో మీనింగ్ ఫుల్ లిరిక్స్ రాసారు. కోపగించుకున్న భార్యను కూల్ చేయడానికి, ఆమె మీద ఉన్న అపారమైన ప్రేమను భర్త ఎలా వ్యక్తం చేసాడనేది ఈ పాట ద్వారా తెలియజెప్పారు.

విజువల్ గానూ ఈ పాట చాలా బాగుంది. సెటప్ అంతా 1980-90స్ కాలాన్ని గుర్తు చేస్తుంది. ఇందులో దుల్కర్‌, మీనాక్షి జంట చూడముచ్చటగా ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 'సార్' సినిమాలోని 'మాస్టారు మాస్టారు' పాట మాదిరిగానే.. 'శ్రీమతి గారు' పాట 'లక్కీ భాస్కర్‌' సినిమాపై జనాల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ముంబై బ్యాక్ డ్రాప్ లో అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ కథాంశంతో ''లక్కీ భాస్కర్'' సినిమా తెరకెక్కుతోంది. దీంట్లో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ కనిపిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో ఒకరోజు ముందుగా, అక్టోబర్ 30 నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. 'సీతా రామం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దుల్కర్‌ సల్మాన్‌.. ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Full View
Tags:    
  • Luckybhaskar 
  • Dulquersalman 
  • Meenakshichaudhary 
  • Srimathigaru 
  • GVPrakash 
  • VishalM 
  • Shweta 

Similar News

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS