లేదు కాదంటూనే ఈ వ్యవహారాలేంటి అమ్మడు..!

ఈ సమ్మిట్ లో భాగంగా శ్రీలీల మరోసారి కార్తీక్ ఆర్యన్ మదర్ తో క్లోజ్ గా కనిపించింది.;

Update: 2025-05-02 15:24 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల సడెన్ గా బాలీవుడ్ లో ఎక్కువ వార్తల్లో ఉంటుంది. హిందీలో అమ్మడు చేస్తున్న తొలి సినిమానే దీనికి కారణమనిపిస్తుంది. శ్రీలీల కార్తీక్ ఆర్యన్ జంటగా ఒక సినిమా వస్తుంది. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ చూస్తే ఇదేదో ఆషికి సీరీస్ లానే ఉంది. అంతేకాదు తెలుగులో ఇన్ని సినిమాలు చేసిన శ్రీలీల ఎప్పుడు గ్లామర్ విషయంలో శృతిమించలేదు. కానీ బాలీవుడ్ లో చేస్తున్న ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది.

రిలీజైన టీజర్ తోనే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఐతే కార్తీక్ ఆర్యన్ తో కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ రిలేషన్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తుంది. దానికి బలం చేకూరుస్తూ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో శ్రీలీల చాలా క్లోజ్ గా ఉంటుంది. ఆమధ్య కార్తీక్ ఆర్యన్ మదర్ కూడా తన కోడలు శ్రీలీలలా ఉండాలని హింట్ ఇచ్చింది. అప్పుడే కార్తీక్, శ్రీలీల మధ్య సంథింగ్ సంథింగ్ అని అనుకున్నారు.

ఇక లేటెస్ట్ గా వేవ్స్ సమ్మిట్ ప్రోగ్రాంలో మరోసారి శ్రీలీల వ్యవహారం బయటపడింది. ఈ సమ్మిట్ లో భాగంగా శ్రీలీల మరోసారి కార్తీక్ ఆర్యన్ మదర్ తో క్లోజ్ గా కనిపించింది. మరి శ్రీలీలకు ఆమె ఒక్కతే తెలుసా లేదా కావాలనే ఆమె దగ్గరకు వెళ్తుందా అన్నది తెలియదు కానీ శ్రీలీల కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో కనిపించిన ప్రతిసారి బీ టౌన్ మీడియా మొత్తం రకరకాల వార్తలు రాస్తున్నారు.

శ్రీలీల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర సినిమా చేస్తుంది. మరో సినిమా కూడా లైన్ లో ఉంది. తమిళ్ లో శివ కార్తికేయన్ పరాశక్తిలో నటిస్తుంది. బాలీవుడ్ లో చేస్తున్న సినిమా టీజర్ తో మంచి క్రేజ్ ఏర్పడింది. ఐతే బాలీవుడ్ లో శ్రీలీల సినిమా గురించి కన్నా ఎక్కువగా కార్తీక్ ఆర్యన్ తో ఆమె రిలేషన్ ఏంటన్నదిగా చర్చిస్తున్నారు. మరి కెరీర్ మొదట్లోనే ఇలాంటి వార్తలు రావడం కచ్చితంగా శ్రీలీల సినిమాల మీద ఎఫెక్ట్ పడేస్తాయని చెప్పొచ్చు. తెలుగులో హిట్లు కన్నా ఫ్లాపులే ఎక్కువ ఉండగా తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది శ్రీలీల. మాస్ జాతర మీద భారీ హోప్స్ పెట్టుకున్న అమ్మడు ఆ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తుంది.

Tags:    

Similar News