శ్రీకాంత్ ఓదెల మళ్ళీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా చేస్తాడా...
దసర సినిమాతో ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదేల... సుకుమార్ దగ్గర 'నాన్నకు ప్రేమతో ', 'రంగస్థలం' సినిమాకి దర్శకత్వ విభాగంలో పనిచేసిన శ్రీకాంత్ తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు
దసర సినిమాతో ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదేల... సుకుమార్ దగ్గర 'నాన్నకు ప్రేమతో ', 'రంగస్థలం' సినిమాకి దర్శకత్వ విభాగంలో పనిచేసిన శ్రీకాంత్ తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మరలాంటి దర్శకుడు రీసెంట్ గా 'ది ప్యారడైజ్' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డివైడ్ టాక్ తో రన్ అవుతున్నప్పటికి కలెక్షన్స్ మాత్రం భారీగానే సంపాదిస్తుంది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో నడుస్తుంది. శ్రీకాంత్ ప్యారడైజ్ సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో ఒక అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే చిరంజీవి శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ ఇప్పుడప్పుడే సెట్ అవుతుందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కారణం ఏంటంటే ప్రస్తుతం చిరంజీవికి కొన్ని కమిట్ మెంట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదేల సైతం ప్యారడైజ్ తో ప్రేక్షకులందరిని పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోయాడు. కాబట్టి చిరంజీవితో వెంటనే సినిమా చేసే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి.
శ్రీకాంత్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేసిన కూడా తన మొదటి రెండు సినిమాల మాదిరిగానే మూడో సినిమాని కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తాడా? లేదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొదటి రెండు సినిమాల్లో కోర్ తెలంగాణ నేటివిటీ ని చూపించిన శ్రీకాంత్ రాబోయే సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు. మరోసారి తెలంగాణ బ్యాక్ డ్రాప్ ను నమ్ముకుంటాడా? లేదంటే ఈసారి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను అలరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ తన తదుపరి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అలాంటప్పుడు ఒక యాసకి భాషకి కమిట్ అవ్వకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశ్యంతోనే స్క్రిప్ట్ ను డిజైన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి శ్రీకాంత్ మీద ప్రొడ్యూసర్స్ గాని హీరోలు గానీ పూర్తి నమ్మకంతో ఉండటానికి కారణమేంటంటే తను మేకింగ్ పరంగా విజువల్స్ ని చాలా రిచ్ గా చూపించే ప్రయత్నం చేస్తాడు. కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా రాసుకోగలిగితే మాత్రం శ్రీకాంత్ తన మేకింగ్ తో అద్భుతాన్ని క్రియేట్ చేయగలడు. అందుకే తను ఇప్పుడు కథ స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. తన తదుపరి సినిమా హీరో ఎవరైనా కూడా వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి శ్రీకాంత్ ఇప్పటినుంచి రంగం సిద్ధం చేసుకుంటున్నారట...