ఓదెల.. ఇప్పుడేం చేస్తున్నట్లు!

'దసరా' సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

Update: 2026-10-26 09:30 GMT

'దసరా' సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై తర్వాత మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నానితో చేసిన 'ది ప్యారడైజ్' కూడా మంచి విజయం సాధిస్తుందని చాలామంది భావించారు. కానీ ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ను అందుకోలేకపోయింది. థియేటర్లలో రిలీజ్ అయ్యి, రీసెంట్ గా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయినా ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మాత్రం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఏం చేస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి 'ప్యారడైజ్' రిలీజడ్ టైమ్ లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు సాధించినా.. ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వైలెన్స్ ఎక్కువగా ఉండటంపై కొందరు విమర్శలు చేశారు. దీంతో శ్రీకాంత్ ఓదెల వర్క్ స్టైల్ పో సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ కొన్నిరోజులుగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

అయితే ఇలాంటి సమయంలో ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, తర్వాతి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం మాత్రం ఆయన పబ్లిక్ లో పెద్దగా కనిపించడం లేదని చెప్పాలి. మరోవైపు శ్రీకాంత్ ఓదెల తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందని కొన్ని నెలల క్రితం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ మూవీకి నాని ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు.

కానీ 'ది ప్యారడైజ్' రిజల్ట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి సినిమా రద్దయిందని చెప్పడానికి ప్రూఫ్స్ లేవు. చిరంజీవి ప్రస్తుతం తన ఇతర సినిమాలతో బిజీగా ఉండటం, శ్రీకాంత్ తన తదుపరి కథపై కసరత్తు చేయాల్సి రావడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, నిజంగా చిరంజీవితోనే శ్రీకాంత్ తన మూడో చిత్రాన్ని చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

'ది ప్యారడైజ్' రిజల్ట్ నుంచి శ్రీకాంత్ కొన్ని లెసెన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. సినిమా మొదలైన తర్వాత ఛేంజెస్ చేసుకుంటూ వెళ్లడం కంటే ముందుగానే స్టోరీని కంప్లీట్ గా రెడీ చేసుకోవడం చాలా మంచిది. ఈసారి అలాంటి ఎలిమెంట్స్ పై ఆయన ఎక్కువ సమయం కేటాయించి ఇప్పుడు వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఒక సినిమా అనుకున్నంత రిజల్ట్ సాధించినంత మాత్రాన దర్శకుడి కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లు కాదు. కానీ తర్వాతి సినిమా మాత్రం మరింత మెయిన్ గా మారుతుంది. 'దసరా' మూవీతో తనపై నమ్మకం పెంచుకున్న శ్రీకాంత్.. ఇప్పుడు ఆ నమ్మకాన్ని కచ్చితంగా తిరిగి నిలబెట్టుకోవాల్సి ఉంది. చిరంజీవితోనే నెక్స్ట్ సినిమా తీసినా లేక మరో కథతో ముందుకొచ్చినా.. ఈసారి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం ఆయన మందున్న సవాల్. అందుకే శ్రీకాంత్ ఓదెల తర్వాతి స్టెప్ ఎలా ఉండబోతుందన్నది అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News