మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య స్పెషల్ ఫోకస్.. మొదటి మూవీలోనే సరికొత్త గెటప్?

నందమూరి నటసింహం బాలయ్య బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న నటుడు మోక్షజ్ఞ. గత ఐదారు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే వార్తలు వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు.

Update: 2026-10-26 06:12 GMT

నందమూరి నటసింహం బాలయ్య బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న నటుడు మోక్షజ్ఞ. గత ఐదారు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే వార్తలు వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ అది వర్కౌట్ కాలేదు. వశిష్ట డైరెక్షన్ లో మోక్షజ్ఞ మొదటి సినిమా చేస్తున్నాడు. మొదటి మూవీతోనే మోక్షజ్ఞ ను టాప్ హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో బాలయ్య ఉన్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే విధంగా కథను రాసుకున్నారట. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని బాలయ్య బాబు దగ్గరుండి మరి పరిశీలిస్తున్నాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధిస్తే సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మొదటి అడుగు తడబడితే మాత్రం ఆ తర్వాత సక్సెస్ లు రావడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ప్రేక్షకులు హీరో మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం కూడా ఉందని బాలయ్య బాబు భావిస్తున్నాడు. దానికోసమే పకడ్బందీ ప్రణాళికతో కథను సిద్ధం చేశారట.

మోక్షజ్ఞ ఆ గెటప్ లో కనిపిస్తాడా?

ఈ సినిమాలో మోక్షజ్ఞ టాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. వశిష్ట ఒక స్వచ్ఛమైన ప్రేమకథ నేపధ్యంలో ఈ మూవీ ని తీర్చిదిద్దుతున్నాడట. బాలయ్య సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ సైతం ఇందులో ఉండబోతున్నాయట. మొదటి సినిమా తోనే మోక్షజ్ఞ తనలోని అన్ని క్వాలిటీస్ ని ప్రేక్షకుల ముందుంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇప్పటికే డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞ ఈ జనరేషన్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్ చేస్తాడట. ఫైట్స్ చేసేటప్పుడు డూప్ ను కూడా వాడకుండా తనే ఒరిజినల్ గా చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. మొత్తానికైతే మోక్షజ్ఞ నందమూరి ఫ్యామిలీ 4వ తరం వారసుడిగా నిలబడాలంటే ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకోవాలి. అలాగే తను చేసే క్యారెక్టర్ లో తనదైన మార్క్ ను చూపించాల్సిన అవసరమైతే ఉంది.

స్టార్ హీరో అవుతాడా?

ఒక్కో హీరోకి ఒక్కో స్టైల్ ఉంటుంది. మోక్షజ్ఞ ఎలాంటి శైలితో ముందుకు సాగుతాడు. తనకంటూ ఒక ఒరిజినాలిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా? బాలయ్య మోక్షజ్ఞని ఎంత రిఫర్ చేసినా మొదటి సినిమా వరకే, రెండో సినిమా నుంచి మోక్షజ్ఞ తనను తాను ఎలివేట్ చేసుకోగలగాలి. లేకపోతే చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ అన్ని విభాగాల్లో శిక్షణ తీసుకున్నాడు. స్టార్ హీరోకి ఎలాంటి క్వాలిటీస్ కావాలో అలాంటి అన్ని క్వాలిటీస్ ని రంగరించుకొని మరి రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది...

Tags:    

Similar News