నిఖిల్.. కాస్త డిఫరెంట్ గా క్యాప్చర్ చేశారేమో!
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు 'స్వయంభు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు 'స్వయంభు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆయన యోధుడిగా కనిపించనున్నారు. అయితే రీసెంట్ గా నిఖిల్ కొత్త పోస్టర్ లో ఆయన ఫేస్ కాస్త భిన్నంగా కనిపించడంతో సోషల్ మీడియాలో డిబేట్ మొదలైంది.
నిజానికి 'స్వయంభు' సినిమా కోసం మూవీ టీమ్ భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ సిద్ధం చేస్తోంది. ఆ వర్క్స్ ను ఫాంటమ్ ఎఫ్ఎక్స్ సంస్థ చూసుకుంటోంది. రీసెంట్ గా ఆ టీమ్ రూపొందించిన కొన్ని విజువల్స్ ను చూసిన నిఖిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అవుట్ పుట్ చూసి తన మైండ్ బ్లాంక్ అయిందని, సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సోషల్ మీడియాలో తెలిపారు. ఈ ఏడాదే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని కూడా పేర్కొన్నారు.
అయితే నిఖిల్ ప్రశంసలు అందుకున్న విజువల్స్ పై ఇప్పుడు మరో యాంగిల్ లో చర్చ జరుగుతోంది. పోస్టర్ లో ఆయన ఫేస్ సాధారణంగా కనిపించే తీరుకు భిన్నంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో ఛేంజ్ కనిపిస్తోందని, ఫొటోను కాస్త డిఫరెంట్ గా రూపొందించారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పోస్టర్ లోని కొన్ని వివరాలను గమనిస్తూ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఆ డిబేట్ లో వినిపిస్తున్న ప్రశ్న ఏఐ గురించే. ఇటీవల సినిమా పోస్టర్లు, టీజర్ల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగింది. దీంతో ఏదైనా విజువల్ లో చిన్న తేడా కనిపించినా నెటిజన్లు వెంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'స్వయంభు' పోస్టర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే నిఖిల్ ముఖం కాస్త భిన్నంగా కనిపించిందనే కారణంతోనే ఏఐ వాడారని చెప్పలేం. కెమెరా యాంగిల్, లైటింగ్, డిజిటల్ కలరింగ్, గ్రాఫిక్స్ పనుల వల్ల కూడా ఫేస్ స్క్రీన్ పై కనిపించే తీరు మారవచ్చు.
ముఖ్యంగా భారీ వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమాల్లో విజువల్స్ ను ఇంకా మంచిగా చూపించేందుకు అనేక ఛేంజెస్ చేస్తుంటారు. కాబట్టి పోస్టర్ ను చూసి ఏఐ వాడారని ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ వస్తేనే అసలు విషయం తెలుస్తుంది. గతంలోనూ 'స్వయంభు' విజువల్స్ లో ఏఐ వాడారనే చర్చ వచ్చినప్పుడు, తమ సినిమాలో ఏఐ విజువల్స్ ఉపయోగించలేదని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. ప్రతి షాట్ ను వీఎఫ్ఎక్స్ టీమ్ శ్రమించి రూపొందించిందని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ కొత్త డౌట్లు తీసుకొచ్చారు.
దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీ, అప్పటి కాలాన్ని చూపించే విజువల్స్ తో సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇలాంటి సమయంలో పోస్టర్ లోని చిన్న ఛేంజ్ కనిపిస్తుందని చర్చ జరగడం కామనే. దీనిపై నిఖిల్ మళ్లీ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.