రూ.2 కోట్ల బడ్జెట్, రూ.135 కోట్ల కలెక్షన్స్‌.. వాళ్లు తల ఎక్కడ పెట్టుకోవాలో?

గడచిన పది పదిహేను ఏళ్లుగా సినిమాల బడ్జెట్‌ విపరీతంగా పెరిగింది. ఇరవై ఏళ్లకు ముందు వరకు స్టార్‌ హీరోల సినిమాల బడ్జెట్‌ పాతిక నుంచి ముప్పు, మహా అయితే యాబై కోట్ల వరకు ఉండేది.

Update: 2026-10-26 07:10 GMT

గడచిన పది పదిహేను ఏళ్లుగా సినిమాల బడ్జెట్‌ విపరీతంగా పెరిగింది. ఇరవై ఏళ్లకు ముందు వరకు స్టార్‌ హీరోల సినిమాల బడ్జెట్‌ పాతిక నుంచి ముప్పు, మహా అయితే యాబై కోట్ల వరకు ఉండేది. కానీ ఇప్పుడు వందల కోట్లతో స్టార్‌ హీరోల సినిమాలు రూపొందుతున్నాయి. అప్పటితో పోల్చితే సినిమాలు చూసే వారు ఎక్కువ అయ్యారా అంటే అదీ లేదు. టికెట్ల రేట్లు విపరీతంగా పెంచి ఆ భారంను చూసే కొంత మంది ప్రేక్షకుల మీద వేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు సినిమాలకే దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు సైతం భారీ వసూళ్లు నమోదు చేసిన దాఖలు ఉన్నాయి. కానీ స్టార్‌ హీరోలు మాత్రం తమ సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందాల్సిందే, భారీగా ఖర్చు చేయాల్సిందే, భారీ సెట్టింగ్స్‌ వేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. అలాగే దర్శకులు సైతం భారీతనంతో సినిమాలు తీస్తారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే కొందరికి ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు సినిమాలు చెంప పెట్టుగా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రేమద ఊరాలి సినిమా....

వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీస్తేనే వందల కోట్ల వసూళ్లు వస్తాయని ఉన్న అభిప్రాయంను తాజా సినిమాలు కొట్టి పారేశాయి. హిందీలో వచ్చిన హనుమాన్‌ అంశ్‌ సినిమా రెండు నుంచి మూడు కోట్ల రూపాయల మధ్య బడ్జెట్‌తో రూపొందించారని తెలుస్తోంది. నిర్మాతలు ఆమాత్రం కూడా ఖర్చు చేసి ఉండకపోవచ్చని కొందరు అంటున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ.450 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. లాంగ్‌ రన్‌లో కచ్చితంగా రూ.500 కోట్లను మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు కన్నడ మూవీ 'ప్రేమద ఊరాలి' సినిమా సైతం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాను రెండు కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందించారని సమాచారం. అయితే కన్నడ ప్రేక్షకులు సినిమాపై విపరీతమైన ప్రేమ కనబర్చుతూ వంద కోట్లకు పైగా వసూళ్లు కట్టబెట్టారు. ఈ సినిమా తెలుగులోనూ డబ్‌ అయ్యి విడుదలైన విషయం తెల్సిందే.

టాలీవుడ్‌లోనూ విడుదల...

తెలుగులో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకు రూ.135 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు క్యూ కడుతున్నారట. తాజాగా ఈ సినిమా కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 ఆల్ టైమ్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది. కేజీఎఫ్‌ 1 సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.134 కోట్లను రాబట్టింది. ఇప్పుడు ఆ వసూళ్లను ప్రేమద ఊరాలి సినిమా ఈజీగా క్రాస్‌ చేసింది. ఇతర భాషల్లో పెద్దగా విడుదల అయ్యిందే లేదు. కేవలం కన్నడ ప్రేక్షకులు ఈ భారీ మొత్తంలో వసూళ్లు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ సినిమా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో కర్ణాటక నుంచి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కాంతార చాప్టర్‌ 1, రెండో స్థానంలో కాంతార, మూడో స్థానంలో కేజీఎఫ్ 2 సినిమాలు ఉన్నాయి.

ప్రేమద ఊరాలి సినిమా వసూళ్లు...

ప్రేమద ఊరాలి సినిమా విడుదల సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రమోషన్‌ సమయంలో సినిమా నిర్మాతలు డబ్బులు లేక చేతులు ఎత్తేశారు. చివరకు పెళ్లి పత్రికల తరహాలో ఆహ్వాన పత్రికలు ముద్రించి వాటిని బస్సుల్లో ఇవ్వడం, రోడ్ల మీద ఇవ్వడం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్స్‌ వేయించడం ద్వారా కూడా సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సినిమా నిర్మాణంకు డబ్బులు ఖర్చు చేసిన నిర్మాతలు పబ్లిసిటీ కి డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే సినిమాకు మౌత్‌ టాక్‌ తో వంద కోట్లకు మించి వసూళ్లు రావడం నిజంగా అద్భుతంగా చెప్పుకోవాలి. కేవలం రెండు కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమా తీసి ఈ స్థాయి వసూళ్లు సాధించడం చూసి, వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసి, ఆకట్టుకోలేక పోతున్న దర్శకులు, హీరోలు తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కొందరు సినీ గోయర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News