టాప్ స్టోరి: డంబ్ అండ్ డెఫ్ - వైక‌ల్యాలు క‌ళారంగంలో అడ్డంకి కాదు!

భారతీయ సినీరంగం ఎల్లప్పుడూ ప్రతిభకే మొదటి పీఠం వేస్తుంది.

Update: 2026-10-26 07:09 GMT

భారతీయ సినీరంగం ఎల్లప్పుడూ ప్రతిభకే మొదటి పీఠం వేస్తుంది. భాష, భౌతిక రూపం లేదా ఇతర పరిమితులతో సంబంధం లేకుండా నిజమైన నటనను, భావోద్వేగాలను పండించగల ఆర్టిస్టులను ఆదరించడంలో ఇండియన్ సినిమా ముందు వరుసలో ఉంటుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రసీమలలో మాటలు రాకపోయినా, వినికిడి లోపం ఉన్నా లేదా ఇతర అంగవైకల్యాలు ఉన్నప్పటికీ తమ అద్భుతమైన నటనతో ఆ పరిమితులను అధిగమించి స్టార్స్‌గా రాణించిన ఎందరో నటీనటులు దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు.

ఈ కోవలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు తమిళం, తెలుగు చిత్రాల్లో ప్రాచుర్యం పొందిన నటి అభినయ. పుట్టుకతోనే వినికిడి.. మాట్లాడే శక్తి లేకపోయినా.. తన కళ్లలోని భావాలు.. ముఖకవళికలతోనే పాత్రలోని ఆత్మను ఆవిష్కరించి శంభో శివ శంభో, స్టార్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధమాకా వంటి చిత్రాల్లో ప్రశంసనీయ పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్‌లో సరితా జోషి, జయభదూరి వంటి వారితో పాటు వినికిడి సవాళ్లు ఉన్న అనేకమంది థియేటర్ ఆర్టిస్టులు హిందీ, మరాఠీ తెరపై తమదైన‌ ముద్ర వేశారు. కన్నడ, మలయాళ చిత్రపరిశ్రమలలోనూ పలువురు దివ్యాంగ కళాకారులు సహాయ పాత్రలు .. క్యారెక్టర్ రోల్స్‌లో అలరించి విమర్శకుల మెప్పు పొందారు.

సినిమా- నాటక రంగాలలో శారీరక వైకల్యం అనేది అవకాశాలకు ఏమాత్రం అడ్డంకి కాదని గతంలో వచ్చిన అనేక వార్తా కథనాలు, విశ్లేషణలు స్పష్టం చేశాయి. దర్శకులు కూడా పాత్ర స్వభావాన్ని బట్టి లేదా వారిలోని సహజత్వానికే ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా సన్నివేశాలు డిజైన్ చేస్తున్నారు. సైన్ ల్యాంగ్వేజ్ (సంకేత భాష).. బాడీ లాంగ్వేజ్ ఆధారంగా పూర్తిస్థాయి నటనను రాబట్టవచ్చని, మాటలు లేకపోయినా భావోద్వేగాలు అంద‌రికీ న‌చ్చుతాయ‌ని శంకర్, మణిరత్నం, స‌ముదిర‌క‌ని వంటి దిగ్గజ దర్శకులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

అందువల్ల నటనా రంగానికి వైకల్యం గానీ, వినికిడి లేదా సంభాషణ సమస్యలు గానీ అడ్డుకావని.. కేవలం పట్టుదల, ఆత్మవిశ్వాసం -నటనపై మక్కువ ఉంటే చిత్ర పరిశ్రమలో అవకాశాల కొరత ఎంతమాత్రం ఉండదని నిరూపించబడింది. సమకాలీన సినిమాలో పెరుగుతున్న సాంకేతికత - విభిన్న కథాంశాల రాకతో దివ్యాంగ ఆర్టిస్టులకు మరిన్ని విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇది కొత్త తరం కళాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. వినికిడి స‌మ‌స్య‌, వైక‌ల్యం ఉన్నంత మాత్రాన క‌ళారంగానికి దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు.

Tags:    

Similar News