వెంకీని ఢీకొట్టే ధైర్యం ఒక్కడికే..
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటంబం’ సినిమా ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ కావాల్సింది.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటంబం’ సినిమా ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యమై అక్టోబరు 2కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ కుదరక 9వ తేదీకి వాయిదా వేశారు. చివరికి ఆ డేట్‌కి కూడా సినిమా రాలేదు. రిలీజ్‌కు ఐదు రోజుల ముందు మళ్లీ వాయిదా వేశారు. ఆఖరికి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ ఈ సినిమా వల్ల ఇండస్ట్రీలో చాలా డిస్టబెన్స్ జరిగింది. అనేక సినిమాలు డేట్లు మార్చుకున్నాయి.
చివరికి 30వ తేదీకి ఫిక్సయిన సినిమాలు కూడా ఒక్కొక్కటిగా తప్పుకోక తప్పలేదు. ముందుగా ‘సమ్మర్ హాలిడేస్’ను పోటీ నుంచి తప్పించి నవంబరు 6కు ఫిక్స్ చేశారు. తర్వాత ‘ఇట్లు అర్జున’ సినిమా రేసు నుంచి తప్పుకుంది. ఆ సినిమాను నవంబరు 13న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘కిల్లర్’ అనే చిన్న సినిమా 30నే వస్తుందని అంటున్నారు కానీ.. అది కూడా వాయిదా పడొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ చిన్న సినిమా పోటీలో ఉన్నా జనాలు ఏమాత్రం కన్సిడర్ చేస్తారన్నది సందేహం.
ఐతే వెంకీ సినిమాకు పోటీగా ఓ పేరున్న సినిమా వస్తోంది. అదే.. కల్ట్. విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది. ఇండియాస్ ఫస్ట్ శ్లాషర్ ఫిలిం అంటూ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది అల్ట్రా వయొలెన్స్ ఉన్న సినిమా. ‘ది ప్యారడైజ్’లో హింసాత్మక సన్నివేశాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరం.
ఐతే ఇది యూత్.. ముఖ్యంగా జెన్‌జీ కిడ్స్ను టార్గెట్ చేసిన సినిమా అని.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాదని.. టార్గెటెడ్ ఆడియన్స్‌ను రీచ్ అయితే చాలని అంటున్నాడు విశ్వక్. ‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ మూవీ కావడంతో దాని ప్రేక్షకులు దానికుంటే.. తన ఆడియన్స్ తనకున్నారన్నది విశ్వక్ ధీమా. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్లాష్ చూడబోతున్నాం. మరి ‘ఆదర్శ కుటుంబం’ ధాటిని తట్టుకుని ‘కల్ట్’ ఏమేర నిలుస్తుందో చూడాలి.