'కాకా'తో క్యా హై? సౌత్ సినిమాతో క‌పూర్ సాబ్ మెగానుబంధం!

బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ దక్షిణాది చిత్రసీమతో దశాబ్దాలుగా ప్రత్యేకమైన, బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

Update: 2026-10-26 03:59 GMT

బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ దక్షిణాది చిత్రసీమతో దశాబ్దాలుగా ప్రత్యేకమైన, బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆయ‌న ద‌క్షిణాదికి, ముఖ్యంగా తెలుగు వారికి ఇచ్చే గౌర‌వం, విలువ ఎంతో గొప్ప‌వి. కెరీర్ ప్రారంభం నుంచే అత‌డు చాలామంది ప్రముఖ సౌత్ దర్శకులతో కలిసి పనిచేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం `పల్లవి అనుపల్లవి`తో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కపూర్ ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో `పుష్పక విమానం` లోనూ నటించారు. అంతేకాకుండా ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన `నాయక్`(తమిళ్ `ముదల్వన్` రీమేక్), బాపూ దర్శకత్వంలో `వో సాత్ దిన్`, `మొహబ్బత్`, అలాగే ప్రియదర్శన్, సురేష్ కృష్ణ వంటి దక్షిణాది దిగ్గజ దర్శకుల దర్శకత్వంలో పలు సూపర్ హిట్ హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు.

తెలుగు - తమిళ భాషలలో అనిల్ కపూర్ చేసిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 1980లో వచ్చిన బాపూ దర్శకత్వంలోని`వంశవృక్షం` చిత్రంలో ఒక చిన్న పాత్రతో తెలుగు తెరపై కనిపించిన ఆయన ఆ తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన `చంటి` చిత్రంలో అతిథి పాత్రలో మెరిసారు. అలాగే కమల్ హాసన్ క్లాసిక్ ఫిల్మ్ `భారతీయుడు` (తమిళంలో `ఇండియన్`).. `చంద్రలేఖ` వంటి చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించారు. కథకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ.. తన విలక్షణమైన అభినయం - ఎనర్జీతో దక్షిణాది ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించారు. మ‌ణిర‌త్నం, సింగీతం, బాపూ సురేష్‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శ‌న్ ల‌తో క‌పూర్ స్టార్ అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.

అంతేకాదు.. టాలీవుడ్ లెజెండరీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవితో కపూర్ సోదరులు బోనీ కపూర్, అనిల్ కపూర్‌లకు సుదీర్ఘమైన.. ఎంతో ఆత్మీయమైన బంధం ఉంది. 1980ల నుంచే చిరంజీవి - అనిల్ కపూర్ మంచి మిత్రులుగా ఉంటూ ఒకరికొకరు ఎంతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. మరోవైపు బోనీ కపూర్ చిరంజీవితో ప‌లు చిత్రాల రీమేక్ హక్కుల విషయంలోనూ, పాన్-ఇండియా సినిమాల చర్చల్లోనూ వ్యాపారపరంగా, వ్యక్తిగతంగా అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. క‌పూర్ ల‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ స్నేహబంధం ఇప్పుడు వెండితెరపై ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపంలో రూపుదిద్దుకుంటోంది.

ముఖ్యంగా 2020 నుంచి 2026 మధ్య కాలంలో అనిల్ కపూర్ దక్షిణాదికి చెందిన ప‌లు ప్రతిష్టాత్మక సినిమాలలో భాగమయ్యారు. ప్రశాంత్ నీల్, శంకర్, సందీప్ రెడ్డి వంగా వంటి సౌత్ దర్శకుల నేతృత్వంలో వచ్చిన బాలీవుడ్, పాన్-ఇండియా చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన `యానిమల్` (2023) చిత్రంలో రణబీర్ కపూర్ తండ్రిగా ఆయన కనబరిచిన నటన దక్షిణాది ప్రేక్షకులను కూడా ఎంతగానో కట్టిపడేసింది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేష‌న్ డ్రాగ‌న్ లోను అత‌డు కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. దక్షిణాది మేకింగ్ శైలిపై అనిల్ కపూర్‌కి ఉన్న నమ్మకానికి ఈ తరహా పాన్-ఇండియా సినిమాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `కాకా`లో అనిల్ కపూర్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ పాత్ర నిడివి తక్కువే అయినా కథను మలుపు తిప్పేంత బలమైన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవితో ఉన్న సుదీర్ఘ అనుబంధం, అనిల్ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ .. ఆయన నటన ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News