జాన్వీ ఎందుకలా ఇర్రిటేటింగ్గా కనిపిస్తోంది?
ఇటీవల సినిమాలు విజయం సాధించినా జాన్వీకి అంతగా మంచి పేరు రావడం లేదు.
ఇటీవల సినిమాలు విజయం సాధించినా జాన్వీకి అంతగా మంచి పేరు రావడం లేదు. తెలుగు అగ్ర హీరోలు కూడా కేవలం జాన్వీ గ్లామర్ ని మాత్రమే ఉపయోగించుకున్నారనే వాదనలు వినిపించాయి. దీనికి తోడు `పెద్ది` కాంట్రవర్శీ, గ్లామర్ డాళ్ ఇమేజ్ జాన్వీని ఇర్రిటేట్ చేస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా ఇర్రిటేషన్ అలా ఉంచితే, జాన్వీకి ఏం కష్టం వచ్చిందో తాజా ఇన్ స్టా పోస్ట్ లో ఫోటోగ్రాఫ్స్ చూస్తే అర్థమవుతుంది. జాన్వీ ఎందుకనో ఇర్రిటేట్ అవుతూ కనిపించింది.
అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ల కుమార్తెగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, 2018లో వచ్చిన `ధడక్` చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, భావోద్వేగాలను చక్కగా పండించగల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ కిడ్ గా సినిమా రంగంలోకి ప్రవేశించినా.. తన సొంత ప్రతిభతో .. కష్టపడే తత్వంతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కేవలం కమర్షియల్ పాత్రలకే పరిమితం కాకుండా.. విభిన్నమైన - నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ జాన్వీ ప్రయాణం సాగుతోంది. `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్`, `మిలీ`, `గుడ్ లక్ జెర్రీ` వంటి బయోపిక్ .. సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలలో ఆమె కనబరిచిన అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి సినిమాతోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ.. నటనలో పరిణతి సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.
హిందీ చిత్రసీమలోనే కాకుండా దక్షిణాదిలోనూ జాన్వీ కపూర్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నటించిన భారీ బడ్జెట్ చిత్రం `దేవర` ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతూ.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటున్నారు.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా జాన్వీ కపూర్ ఎంతో చురుగ్గా ఉంటారు. తన వ్యక్తిగత విశేషాలు, షూటింగ్ విశేషాలు, ప్రయాణాలు, ఫోటోలను అభిమానులతో క్రమం తప్పకుండా పంచుకుంటారు. గ్లామరస్ లుక్స్ తో పాటు సాదాసీదా జీవనశైలికి సంబంధించిన అంశాలను షేర్ చేస్తూ... తన నటన -వ్యక్తిత్వంతో ఆధునిక చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.