ప్రభాస్‌ లోని ఆ యాంగిల్.. త్రివిక్రమ్ చూపిస్తారా?

ప్రభాస్‌ అంటే భారీ యాక్షన్‌ సీన్లు, పవర్‌ ఫుల్‌ డైలాగులు మాత్రమే కాదు.. ఆయనలో మంచి కామెడీ టైమింగ్‌ కూడా ఉంది.

Update: 2026-10-26 08:15 GMT

ప్రభాస్‌ అంటే భారీ యాక్షన్‌ సీన్లు, పవర్‌ ఫుల్‌ డైలాగులు మాత్రమే కాదు.. ఆయనలో మంచి కామెడీ టైమింగ్‌ కూడా ఉంది. కానీ ఆ యాంగిల్ ను ఇప్పటివరకు ఏ దర్శకుడు కంప్లీట్ గా చూపించలేదని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రీసెంట్ గా అభిప్రాయపడడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్‌ లోని ఆ కొత్త యాంగిల్ ను స్క్రీన్ పై చూపించే దర్శకుడు ఎవరనే చర్చ మొదలైంది.

నిజానికి ప్రభాస్‌ తన కెరీర్‌ లో ఎన్నో విభిన్న పాత్రలు చేశారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా భారీ కథలు, యాక్షన్‌ సీన్స్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ జర్నీలో ప్రభాస్‌ లోని ఫన్నీ యాంగిల్ కు ఎక్కువగా స్పీస్ దక్కలేదనే అభిప్రాయం ఉంది.

ఆయనలోని కామెడీ యాంగిల్ ను కూడా సరైన కథతో చూపిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని త్రివిక్రమ్‌ చెప్పడం గమనార్హం. అయితే డార్లింగ్ లో కామెడీ టైమింగ్‌ ఉందని చెప్పడానికి బుజ్జిగాడు మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో ప్రభాస్‌ తన టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలోని చిలిపితనం అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది.

అంటే ప్రభాస్‌ యాక్షన్‌ చేయగలరు, ఎమోషన్స్ పండించగలరు. అదే సమయంలో తనదైన శైలిలో నవ్వించగలరు. అయితే అలాంటి రోల్స్ ఆయనకు మరిన్ని రావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ వంటి దర్శకుడు ఆ విషయాన్ని ప్రస్తావించడంతో ఆయనతో ప్రభాస్‌ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్, కామెడీకి స్పెషల్ ప్లేస్ ఉంటుంది.

నార్మల్ సీన్స్ ను తన కన్వర్జేషన్స్ తో ఎంటర్టైనింగ్ గా మార్చడం ఆయన స్టైల్. ప్రభాస్‌ నేచురల్ కామెడీకి త్రివిక్రమ్‌ డైలాగ్స్ తోడైతే మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చే అవకాశం ఉంది. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ఫన్నీ డైలాగ్స్, చిలిపి సన్నివేశాలతో ప్రభాస్‌ ను కొత్తగా చూపించవచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

ప్రభాస్‌ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్‌ కూడా వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాతో బిజీగా ఉన్నారు. అందువల్ల వీరిద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడు వస్తుందనేది చెప్పలేం. నిజానికి ప్రభాస్‌ లోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకురావాలంటే ఆయనతో సినిమా చేయాలనే ఆలోచన ఒక్కటే సరిపోదు. దానికి తగిన కథ, పాత్ర కూడా ఉండాలి.

ప్రభాస్‌ స్క్రీన్ పై కనిపించగానే అభిమానులు భారీ సీన్స్ ఆశిస్తారు. అలాంటి అంచనాల మధ్య ఆయనలోని ఫన్నీ యాంగిల్ చూపించడం దర్శకుడికి ఓ మంచి అవకాశం. అదే సమయంలో కొత్త తరహా పాత్రలో ప్రభాస్‌ ను చూసే అవకాశం ప్రేక్షకులకూ దక్కుతుంది. ఇప్పటివరకు ప్రభాస్‌ లోని ఆ యాంగిల్ మిస్ అయ్యామనే ఫీలింగ్ అందరిలో ఉంది. దాన్ని గుర్తించిన త్రివిక్రమ్‌.. తనదైన శైలిలో ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ను చూపిస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News