శ్రీ‌దేవి ఈ టాలీవుడ్ హీరోని పెళ్లాడాల‌నుకున్నారు!

నాటి మేటి క‌థానాయిక శ్రీ‌దేవి జీవితంలో స‌వాళ్ల గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ. అప్ప‌టికే పెళ్ల‌యిన‌ నిర్మాత‌ను పెళ్లాడిన శ్రీ‌దేవి మీడియా హెడ్ లైన్స్ కెక్కారు.;

Update: 2025-04-24 03:59 GMT

నాటి మేటి క‌థానాయిక శ్రీ‌దేవి జీవితంలో స‌వాళ్ల గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ. అప్ప‌టికే పెళ్ల‌యిన‌ నిర్మాత‌ను పెళ్లాడిన శ్రీ‌దేవి మీడియా హెడ్ లైన్స్ కెక్కారు. అంత‌కుముందు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో డేటింగ్ చేసార‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. కానీ విధి త‌న జీవితాన్ని చాలా మ‌లుపులు తిప్పింది. చివ‌రికి పెళ్లయి ఇద్ద‌రు పిల్ల‌లున్న నిర్మాత బోనీ క‌పూర్‌ను పెళ్లాడాల్సి వచ్చింది. ఈ పెళ్లి కార‌ణంగా ఆ నిర్మాత కుటుంబంలో తీవ్ర‌మైన క‌ల‌త‌లు చెల‌రేగాయి.

ఈ విష‌యాల‌న్నీ కాల‌గ‌మ‌నంలో క‌లిసిపోయినా కానీ, తెలుగు, త‌మిళం, హిందీ చిత్ర‌సీమ‌ల్లో అగ్ర క‌థానాయిక‌గా ఏలిన శ్రీ‌దేవి జీవిత విశేషాల గురించి అభిమానులు చ‌ర్చించుకుంటూనే ఉంటారు. ఆస‌క్తిక‌రంగా శ్రీ‌దేవి పెళ్లి చేసుకోవాల‌నుకున్న వ్య‌క్తులు వీళ్లెవ‌రూ కాదు. బాలీవుడ్ హీరో మిథున్ చక్ర‌వ‌ర్తి లేదా బోనీ క‌పూర్ వీళ్లలో ఎవ‌రినీ శ్రీ‌దేవి పెళ్లి చేసుకోవాల‌ని కోరుకోలేదు.

ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో మురళి మోహ‌న్ త‌న‌ను శ్రీ‌దేవి పెళ్లి చేసుకోవాల‌ని ఆమె త‌ల్లి గారు చాలా బ‌లంగా కోరుకున్నార‌ని చెప్పారు. అయితే అప్ప‌టికే త‌న‌కు పెళ్ల‌యింద‌ని తెలుసుకుని ఆ ప్ర‌తిపాద‌న‌ను విర‌మించార‌ని చెప్పారు. త‌న కూతురు శ్రీ‌దేవితో క‌లిసి ఆమె తల్లిగారు త‌న ఇంటికి పెళ్లి గురించి మాట్లాడేందుకు వ‌చ్చార‌ని, కానీ త‌న‌కు పెళ్ల‌యింద‌ని తెలిసి ఆలోచ‌న‌ను విర‌మించార‌ని ముర‌ళీమోహ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అప్ప‌టికే ముర‌ళీ మోహ‌న్ పెద్ద స్టార్ కాగా, శ్రీ‌దేవి అప్ క‌మింగ్ న‌టిగా ఉన్నారు. శ్రీదేవి తల్లి ముర‌ళీ మోహ‌న్ ను తన అల్లుడిని చేసుకోవాల‌ని అనుకున్నారు. కానీ కుద‌ర‌లేదు.

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఈ లోకాన్ని వీడి వెళ్లినా ఇలాంటి ఎన్నో విషయాల‌ను స‌హ‌చ‌ర న‌టులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. పాపుల‌ర్ న‌టుడు కమల్ హాసన్‌ను తన అల్లుడిని చేసుకోవాల‌ని కూడా శ్రీ‌దేవి త‌ల్లి కోరుకుంటున్నట్లు అప్ప‌ట్లో వార్తలు వచ్చాయి. ఆన్ ద స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ క‌మ‌ల్ హాస‌న్ తో శ్రీ‌దేవి కెమిస్ట్రీ ఎంతో గొప్ప‌గా పండింది. దీంతో ఈ పుకార్లు షికార్ చేసాయి. శ్రీదేవి 1996 సంవత్సరంలో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. జాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఈ దంప‌తుల‌కు ఉన్నారు.

Tags:    

Similar News