శ్రీదేవి ఇంటి కోసం హైకోర్టు మెట్లెక్కిన బోనీకపూర్.. అసలేం జరిగిందంటే?

దివంగత నటి శ్రీదేవి తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అలా తెలుగు, తమిళం, మలయాళం,హిందీ, కన్నడ భాషలో హీరోయిన్ గా రాణించి కోట్ల ఆస్తులు పోగేసింది.;

Update: 2025-08-26 06:33 GMT

దివంగత నటి శ్రీదేవి తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అలా తెలుగు, తమిళం, మలయాళం,హిందీ, కన్నడ భాషలో హీరోయిన్ గా రాణించి కోట్ల ఆస్తులు పోగేసింది. అలా నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే అలాంటి శ్రీదేవి దుబాయ్ కి పెళ్లి కోసం వెళ్లి అక్కడే బాత్ టబ్ లో మునిగి చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా శ్రీదేవి కొనుగోలు చేసిన ఆస్తిపై ఓ ముగ్గురు కన్నేసి తమదే ఆ స్థిరాస్తి అంటూ చెబుతున్నారని బోనీ కపూర్ హైకోర్టుని ఆశ్రయించారు. అలాగే ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ అసలు విషయం ఏంటి.. ? శ్రీదేవి ఆస్తిని కబ్జా చేసిన వాళ్ళు ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అందాల తార శ్రీదేవి బతికున్న సమయంలో సంపాదించిన డబ్బుతో ఎన్నో కోట్ల ఆస్తులు కొనుగోలు చేసింది. ఆ ఆస్తులన్ని శ్రీదేవి చనిపోయాక భర్త పిల్లల పేర్లమీదికి మార్చుకున్నారు. అయితే తాజాగా బోనీకపూర్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించి 1988లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి కొనుగోలు చేసిన స్థిరాస్తి పై ఓ ముగ్గురు వ్యక్తులు కన్నేసి తమదే అంటూ చట్టవిరుద్దంగా ఆ ఆస్తిని పొందుతున్నారు అంటూ బోనీకపూర్ ఫిర్యాదు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీదేవి ఎం.సి. సంబండ ముదలైర్ దగ్గర 1988లో స్థిరాస్తి కొనుగోలు చేసింది.ఆ స్థిరాస్థి కొనుగోలు చేసిన సమయంలో ఆ వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

వారందరి సమ్మతం మేరకే శ్రీదేవి ఆస్తి కొనుగోలు చేసింది..

కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే శ్రీదేవి కొన్న స్థిరాస్తి లో మాకు కూడా వాటా ఉంటుంది అని.. మేము ముదలైర్ రెండో భార్య ముగ్గురు కొడుకులం అని వచ్చి శ్రీదేవి కొన్న స్థిరాస్తిలో ఉంటున్నారు.అయితే దీనిపై బోనీకపూర్ ఏప్రిల్ 22,2025 లో హైకోర్టులో కేసు వేశారు. అంతేకాదు మోసపూరిత చట్టపరమైన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలి అంటూ బోనికపూర్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఈ విషయంపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహశీల్దార్ ని ఆదేశించారు.అయితే శ్రీదేవి స్తిరాస్థిపై కన్నేసిన ఆ ముగ్గురు ఎం.సి.సంబండ అనే వ్యక్తి రెండో భార్య కొడుకులమని,మా అమ్మని సంబండ ముదలైర్ 1975 ఫిబ్రవరి 5న రెండో పెళ్లి చేసుకున్నారంటూ చెప్పి తాంబరం తాసిల్దార్ నుండి చట్టబద్ధమైనటువంటి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు.

కానీ దీన్ని విచారించినటువంటి హైకోర్టు సంబండ ముదలైర్ మొదటి భార్య 1999లో చనిపోయింది. కానీ ఆయన రెండో పెళ్లి 1975లో చేసుకున్నట్టు చెప్పారు. కాబట్టి హిందూ వారసత్వ చట్టం ప్రకారం భార్య చనిపోక ముందే రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రెండో భార్య కొడుకులను క్లాస్ 1 లేదా క్లాస్ 2 చట్టపరమైన వారసులుగా వర్గీకరించలేమని జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ చెప్పుకొచ్చారు. అలాగే మోసపూరిత చట్టపరమైన వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికకేట్ ని విచారించి 4 వారాల లోగా నిర్ణయం తీసుకోవాలని తాహశీల్దార్ ని ఆదేశించారు. మరి దీనిపై తాహశీల్దార్ నాలుగు వారాల్లోగా ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది

Tags:    

Similar News