• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీదేవి..మిథున్ బంధంపై...

శ్రీదేవి..మిథున్ బంధంపై లారెన్స్ ఆసక్తికర విషయాలు !

| 1989లో విడుదలైన ‘గైర్ కానూనీ’ షూటింగ్ సమయంలో శ్రీదేవి, మిథున్ చక్రవర్తి మధ్య సాన్నిహిత్యాన్ని కళ్లారా చూశానని సినిమాటోగ్రాఫర్ లారెన్స్ డిసౌజా వెల్లడించారు. షూటింగ్‌లో శ్రీదేవికి మిథున్ తరచూ ఫోన్ చేసేవారని, షూటింగ్ పూర్తయ్యాక సెట్‌కు వచ్చి ఆమె మేకప్ రూమ్‌లో ఎదురుచూసేవారని గుర్తుచేసుకున్నారు. అప్పటికే మిథున్‌కు యోగితా బాలితో వివాహమైందని తెలిపారు.

By - Srikanth Kontham
Update: 2026-11-26 05:38 GMT

ఎనభైవ దశకంలో హిందీ, తెలుగు ప‌రిశ్ర‌మల‌ను నటనతో ఊపేసిన అతిలోక సుందరి శ్రీదేవి , డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి మధ్య సాన్నిహిత్యంపై అప్పట్లో ఎన్నో కథనాలు వినిపించేవి. ఇద్ద‌రి బంధం గురించి అధికారికంగా బయటకు చెప్పకపోయినా? షూటింగ్ సెట్స్‌లో జరిగిన పలు సంఘటనలు అందరి దృష్టినీ ఆకర్షించేవి. తాజాగా 1989లో రిలీజ్ అయిన `గైర్ కానూనీ` సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ లారెన్స్ డిసౌజా ఆనాటి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. సెట్‌లో మిథున్ ఓపికగా ఎదురుచూసే తీరును గుర్తు చేసుకున్నారు.

సిద్ధార్థ్ కన్నన్‌తో మాట్లాడిన లారెన్స్.. `గైర్ కానూనీ` చిత్రీకరణ సమయంలో శ్రీదేవి చాలా నిశ్శబ్దంగా.. తన పనిలోనే మునిగి ఉండేవారు. షాట్ పూర్తయిన తర్వాత ఎవరితోనూ పెద్దగా కలవకుండా ఒంటరిగా కూర్చునేవారు. అయితే షూటింగ్ మధ్యలో మిథున్ నుంచి ఆమెకు తరచూ ఫోన్ కాల్స్ వచ్చేవి. ఫోన్ రాగానే వెళ్లి మాట్లాడి మళ్లీ వచ్చి సీన్ పూర్తి చేసేవారని.. మళ్లీ ఫోన్ రింగైతే వెళ్లేవారన్నారు.

షూటింగ్ పూర్తయ్యే సమయానికి మిథున్ సెట్‌కు వచ్చేవారని.. ఆ తర్వాత శ్రీదేవి మేకప్ రూమ్‌లో ఓపికగా ఎదురుచూసేవారని లారెన్స్ అన్నారు. అప్పటికే మిథున్‌కు యోగితా బాలితో వివాహం అయినా? ఇద్ద‌రి మధ్య ఏదో బంధం ఉందనే విషయం సెట్‌లో అందరికీ తెలిసేదన్నారు. తాను కళ్లారా చూసిన సెట్ విశేషాల వరకే మాట్లాడుతున్నానని లారెన్స్ స్పష్టం చేశారు.

మరోవైపు శ్రీదేవితో కలిసి పనిచేసిన నటి సుజాత మెహతా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిథున్‌తో విడిపోయిన తర్వాత శ్రీదేవి ఎంతగా కుంగిపోయినా? కెమెరా ముందు నిలబడగానే వృత్తిపరంగా పూర్తి ఏకాగ్రతతో నటించేవారని గుర్తు చేసుకున్నారు. షాట్ పూర్త‌వ్వ‌గానే మౌనంగా ఒక మూలన కూర్చునేవారని.. వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉండేదని అభిప్రాయపడ్డారు.

నటుడు..దర్శకుడు కరణ్ రజ్దాన్ కూడా గతంలో ఇద్ద‌రి మధ్య జరిగే అర్ధరాత్రి గొడవల గురించి ప్రస్తావించారు. ఫోన్‌లో తెల్లవారుజాము వరకు వాదులాడుకునేవారని.. కానీ మిథున్ మాత్రం రాత్రంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినా? గొడవ పడినా మరుసటి రోజు ఉదయానికి కచ్చితంగా షూటింగ్‌కు హాజరయ్యేవారని అని కొనియాడారు.

`జాగ్ ఉఠా ఇన్సాన్`, `వక్త్ కీ ఆవాజ్` వంటి పలు చిత్రాల్లో శ్రీదేవి.. మిథున్ కలిసి నటించారు. ఆ తర్వాత 1996లో నిర్మాత బోనీ కపూర్‌ను శ్రీదేవి వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • sridevi 
  • mithunchakraborty 
  • gairkanooni 
  • sridevimithun 
  • bollywood 

Similar News

ఎన్టీఆర్‌తో 'భగవంత్ కేసరి' కాదట..!

2026-11-26 05:56 GMT

భోగి ఈవెంట్స్‌కు ఎందుకు రావడం లేదు? క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్

2026-11-26 05:37 GMT

టాలీవుడ్ సంక్రాంతి బరిలో ఊహించని ట్విస్ట్.. స్టార్ హీరో సినిమా వెనక్కి!

2026-11-26 05:16 GMT

5 వేల ఏళ్ల నాటి రహస్యం.. నాగచైతన్య వృషకర్మ ట్రైలర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

2026-11-26 04:29 GMT

మెగాస్టార్ కెరీర్ హిస్ట‌రీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదేనా?

2026-11-26 04:23 GMT

భర్తతో కలిసి థాయ్‌లాండ్ టూర్.. ప్రియా భవానీ శంకర్ ఫోటోలు వైరల్!

2026-11-26 04:23 GMT

ప్ర‌భాస్-ర‌ణ‌వీర్-ర‌ణబీర్ ఈ ముగ్గురికీ ఒక‌టే స‌మ‌స్య‌!

2026-11-26 03:54 GMT

వృషకర్మపై చైతు కాన్ఫిడెన్స్.. ఆ మాటే హైలెట్..

2026-11-26 03:53 GMT

ఆస్కార్స్- 2027 రేసులో 'రామాయణ'.. హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో ఢీ

2026-11-26 03:53 GMT

బంధిఖానా నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేము.. పెళ్లిపై నిత్యామీన‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

2026-11-26 03:53 GMT

స‌న్‌గ్రూప్ ఉద్యోగుల‌తో అల్లుడు అనిరుధ్ ఆప్యాయ‌త‌- సింప్లిసిటీ!

2026-11-26 03:52 GMT

Copyright @2026

Powered by Blink CMS