• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బంధిఖానా నుంచి...

బంధిఖానా నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేము.. పెళ్లిపై నిత్యామీన‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

| నటి నిత్యా మీనన్ ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధమేనని స్పష్టం చేశారు. కేవలం సమాజం కోసమో, వయసు పెరుగుతోందనో పెళ్లి చేసుకోనని తెలిపారు. సరైన భాగస్వామి దొరక్కపోతే ఒంటరిగా ఉండటమే మేలని ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

By - Sivaji Kontham
Update: 2026-11-26 03:53 GMT

బంగారం నిత్యా మీనన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు! మ‌ణిర‌త్నం ఓకే బంగారంలో ఎంతో క్యూట్ ల‌వర్ గా క‌నిపించిన నిత్యా ఇప్పుడు అందుకు పూర్తి భిన్న‌మైన కోణాన్ని నిజ జీవిత వ్య‌క్తిత్వాన్ని ఆవిష్క‌రించిన తీరు చ‌ర్చ‌గా మారింది. నిత్యా తన వ్యక్తిగత జీవితం- ప్రేమ-పెళ్లి వంటి కీల‌క అంశాల‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ రింగులజుత్తు చిన్నది గతంలో తను ఎదుర్కొన్న కొన్ని సంబంధాల గురించి నిజాయితీగా మాట్లాడారు. తన ఆలోచనలను, స్వేచ్ఛను కట్టడి చేసే బంధాల నుంచి బయటకు రావడం మొదట్లో ఎంతో కష్టంగా అనిపించిందని.. కానీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే తనకు నిజమైన స్వేచ్ఛ- ప్రశాంతత లభించాయని నిత్యా వెల్లడించారు. ఎదుగుదలకు అవకాశం లేని, ఊపిరి ఆడనివ్వని బంధాల్లో కొనసాగడం కంటే ఒంటరిగా ఉండటమే మేలని తాను గ్రహించినట్లు ఆమె పేర్కొన్నారు.

తన మాటల వల్ల చాలామంది తను పెళ్లికి వ్యతిరేకమని అపార్థం చేసుకుంటున్నారని.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని నిత్యా మీనన్ స్పష్టం చేశారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉందని.. అయితే కేవలం సమాజం కోసమో లేదా వయసు పెరుగుతోందనో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ.. స్వేచ్ఛగా ఎదగడానికి తోడ్పడే సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అలాంటి భాగస్వామి దొరక్కపోతే పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమమని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత స్వభావం గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించడం.. అందరి దృష్టి తనపై ఉండటం తనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని నిత్యా తెలిపారు. అయితే జీవితంలో సవాళ్లను స్వీకరించడం కోసమే నటిగా కొనసాగుతున్నానని చెప్పారు. నిత్యా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా నిత్యా గోప్యతను గౌరవిస్తూ.. మీరు కెమెరాల ముందు లేకపోయినా మా హృదయాల్లో ఎప్పుడూ ఉంటారంటూ నెటిజన్లు ఆప్యాయంగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. నిత్యా మీనన్ ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వంలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `మిస్టర్ అండ్ మిసెస్ గ్రే` అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. వివాహేతర సంబంధం, ఆర్థిక మోసాల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

ఇందులో నిత్యా - ఒబెరాయ్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ న‌టించ‌డం క్యూరియాసిటీని పెంచుతోంది. ముఖ్యంగా ఎఫైర్ మ్యాట‌ర్స్ టీజ‌ర్ లో హైలైట్ గా క‌నిపిస్తున్నాయి. నిత్యా మ‌రోసారి న‌టిగా త‌న‌లోని బెస్ట్ ని తీస్తోంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. అంకుర్ పజ్నీ -విశాల్ రంజ‌న్ మిశ్రా ఈ చిత్రానికి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Tags:    
  • nithyamenen 
  • nithyamenon 
  • marriage 
  • mrandmrsgrey 

Similar News

ప్ర‌భాస్-ర‌ణ‌వీర్-ర‌ణబీర్ ఈ ముగ్గురికీ ఒక‌టే స‌మ‌స్య‌!

2026-11-26 03:54 GMT

వృషకర్మపై చైతు కాన్ఫిడెన్స్.. ఆ మాటే హైలెట్..

2026-11-26 03:53 GMT

ఆస్కార్స్- 2027 రేసులో 'రామాయణ'.. హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో ఢీ

2026-11-26 03:53 GMT

స‌న్‌గ్రూప్ ఉద్యోగుల‌తో అల్లుడు అనిరుధ్ ఆప్యాయ‌త‌- సింప్లిసిటీ!

2026-11-26 03:52 GMT

సాయి పల్లవి మరో ప్రయోగం.. పొట్టి జుట్టుతో గర్భిణీగా కనిపించి షాక్ ఇచ్చిన హీరోయిన్!

2026-11-26 03:51 GMT

Bigg Boss Telugu 10: డెమన్ పవన్, రీతూ, శోభా శెట్టి & టేస్టీ తేజ ఎంట్రీ!

2026-11-26 03:50 GMT

వంశీ పైడిపల్లికి కలలో కూడా ఊహించని గిఫ్ట్.. ఇదీ సల్మాన్ రేంజ్ అంటే!

2026-11-25 17:54 GMT

రిలీజ్ కు ముందే 100 మార్కులు వేసిన గ్రేట్ మామ్!

2026-11-25 17:48 GMT

చెంప వాచిపోయినా బామ్ రాసుకుని మ‌రీ త‌న్నులు తిన్నాడు!

2026-11-25 14:30 GMT

నాడు రీల్ జోడీ..నేడు రియల్ బంధువులు!

2026-11-25 13:30 GMT

సింపుల్గా సిద్ధార్థ్ గల్లా పెళ్లి.. మరి మహేష్ బాబు ఎక్కడ?

2026-11-25 12:51 GMT

Copyright @2026

Powered by Blink CMS