• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆస్కార్స్- 2027 రేసులో...

ఆస్కార్స్- 2027 రేసులో 'రామాయణ'.. హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో ఢీ

| నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ: పార్ట్ 1' 2027 ఆస్కార్ రేసులో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్-20లో చోటు దక్కించుకున్నట్లు వెరైటీ కథనం వెల్లడించింది. 'ది ఒడిస్సీ', 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డ్యూన్: పార్ట్ 3' వంటి హాలీవుడ్ చిత్రాలతో పోటీపడుతోంది. 9,000కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్లతో రూపొందిన ఈ చిత్రం తుది నామినేషన్ సాధిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

By - Sivaji Kontham
Update: 2026-11-26 03:53 GMT

ఆస్కార్స్ 2027 గురించి అప్పుడే చ‌ర్చ మొద‌లైంది. ఇందులో `రామాయ‌ణ-1` పేరు విన‌బ‌డుతోంది. రామాయ‌ణ‌తో పాటు, ఆస్కార్స్ పోటీబ‌రిలో ఫైనలిస్టులలో క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ.. స్టీవెన్ స్పీల్‌బర్గ్ డిస్‌క్లోజర్ డే... ర్యాన్ గోస్లింగ్ నటించిన ప్రాజెక్ట్ హెయిల్ మేరీ.. మార్వెల్ స్టూడియోస్ `అవెంజర్స్: డూమ్స్‌డే` ఉన్నాయి. పూర్తి క‌థ‌నంలోకి వెళితే..

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం `రామాయణ` ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటుతోంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో న‌మిత్ మ‌ల్హోత్రా-య‌ష్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రం 99వ ఆస్కార్ అవార్డుల రేసులో `బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్` విభాగంలో టాప్-20 పోటీదారుల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ `వెరైటీ` త‌న క‌థ‌నంలో వెల్లడించింది. ``అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విజువల్ ఎఫెక్ట్స్-2027`` విభాగం తదుపరి రౌండ్‌కు ఎంపికైన 20 చిత్రాల టీమ్‌ల‌కు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే అకాడమీ ఈ జాబితాను అధికారికంగా ప్రకటించక‌పోయినా.. ఇప్ప‌టికి అందిన రిపోర్టుల‌ ప్ర‌కారం.. `రామాయణ` ఆస్కార్ రేసులో స‌త్తా చాటుతుంద‌నే ఉత్సాహం నెల‌కొంది.

ఈ ప్రతిష్ఠాత్మక విభాగంలో `రామాయణ` హాలీవుడ్ దిగ్గజ దర్శకుల చిత్రాలతో తలపడుతోంది. క్రిస్టోఫర్ నోలన్ `ది ఒడిస్సీ`, స్టీవెన్ స్పీల్‌బర్గ్ `డిస్‌క్లోజర్ డే`, డెనిస్ విల్లెన్యూవ్ `డ్యూన్: పార్ట్ 3`, మార్వెల్ స్టూడియోస్ `అవెంజర్స్: డూమ్స్‌డే`, అలాగే ర్యాన్ గోస్లింగ్ నటించిన `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` వంటి భారీ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు జపాన్ చిత్రం `గాడ్జిల్లా: మైనస్ జీరో` కూడా చోటు దక్కించుకోవడం ద్వారా ఆసియా చిత్రాల విజువల్ ఎఫెక్ట్స్ స్థాయికి అకాడమీ ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది.

ఎనిమిది సార్లు ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ డీఎన్‌ఈజీ , రీడిఫైన్ సంస్థలు కలిసి `రామాయణ` కోసం 9000కు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్లను రూపొందించాయి. ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా డీఎన్‌ఈజీ సీఈఓగా వ్యవహరిస్తుండటం విశేషం. ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన జటాయువు, రావణుడి (యశ్) మధ్య జరిగే పోరాట సన్నివేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. గతంలో 2023లో ఎస్.ఎస్. రాజమౌళి `ఆర్ఆర్ఆర్` కూడా ఆస్కార్ విజువల్ ఎఫెక్ట్స్ టాప్-20 జాబితాలో నిలిచినా తుది నామినేషన్‌కు చేరుకోలేకపోయింది.

నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన `రామాయణ: పార్ట్ 1` బాక్సాఫీస్ వద్ద 1700 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఆస్కార్ బజ్‌తో పాటు వచ్చే ఏడాది జరగనున్న క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో కూడా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్... బెస్ట్ స్టంట్ డిజైన్ విభాగాల్లో ఈ చిత్రం షార్ట్‌లిస్ట్ అయింది. డిసెంబర్ 15న ఆస్కార్ విజువల్ ఎఫెక్ట్స్ తుది షార్ట్‌లిస్ట్.. జనవరి 21న నామినేషన్లు వెలువడనుండగా... మార్చి 14న 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో `రామాయణ` తుది నామినేషన్ దక్కించుకుని చరిత్ర సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి.

రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ నుంచి `నాటు నాటు` సాంగ్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో పుర‌స్కారం ద‌క్కించుకున్న త‌ర్వాత భార‌తీయ సినిమాల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆస్కార్స్, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల‌తో ఆర్.ఆర్.ఆర్ ర‌చ్చ గురించి తెలిసిందే. ఇదే చ‌ర్చ‌ను మునుముందు కొన‌సాగించాలంటే ఇప్పుడు న‌మిత్ `రామాయ‌ణ` చిత్రం 2027 ఆస్కార్స్ బ‌రిలో మిరాకిల్స్ చేయాల్సి ఉంటుంది. న‌మిత్ మ‌ల్హోత్రా డీఎన్ఇజీ సంస్థ‌ 9వ సారి ఆస్కార్ పుర‌స్కారం గెలుచుకోవాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    
  • ramayana 
  • oscars2027 
  • yash 
  • namitmalhotra 

Similar News

ప్ర‌భాస్-ర‌ణ‌వీర్-ర‌ణబీర్ ఈ ముగ్గురికీ ఒక‌టే స‌మ‌స్య‌!

2026-11-26 03:54 GMT

వృషకర్మపై చైతు కాన్ఫిడెన్స్.. ఆ మాటే హైలెట్..

2026-11-26 03:53 GMT

బంధిఖానా నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేము.. పెళ్లిపై నిత్యామీన‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

2026-11-26 03:53 GMT

స‌న్‌గ్రూప్ ఉద్యోగుల‌తో అల్లుడు అనిరుధ్ ఆప్యాయ‌త‌- సింప్లిసిటీ!

2026-11-26 03:52 GMT

సాయి పల్లవి మరో ప్రయోగం.. పొట్టి జుట్టుతో గర్భిణీగా కనిపించి షాక్ ఇచ్చిన హీరోయిన్!

2026-11-26 03:51 GMT

Bigg Boss Telugu 10: డెమన్ పవన్, రీతూ, శోభా శెట్టి & టేస్టీ తేజ ఎంట్రీ!

2026-11-26 03:50 GMT

వంశీ పైడిపల్లికి కలలో కూడా ఊహించని గిఫ్ట్.. ఇదీ సల్మాన్ రేంజ్ అంటే!

2026-11-25 17:54 GMT

రిలీజ్ కు ముందే 100 మార్కులు వేసిన గ్రేట్ మామ్!

2026-11-25 17:48 GMT

చెంప వాచిపోయినా బామ్ రాసుకుని మ‌రీ త‌న్నులు తిన్నాడు!

2026-11-25 14:30 GMT

నాడు రీల్ జోడీ..నేడు రియల్ బంధువులు!

2026-11-25 13:30 GMT

సింపుల్గా సిద్ధార్థ్ గల్లా పెళ్లి.. మరి మహేష్ బాబు ఎక్కడ?

2026-11-25 12:51 GMT

Copyright @2026

Powered by Blink CMS