• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ కెరీర్...

మెగాస్టార్ కెరీర్ హిస్ట‌రీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదేనా?

| రాజ్ అండ్ డీకే తొలుత సినిమాగా తీయాలనుకున్న ది ఫ్యామిలీమ్యాన్ కథను వెబ్ సిరీస్‌గా రూపొందించాలని చిరంజీవి సూచించినట్లు చర్చ సాగుతోంది. ఆ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా, అందులో భాగమై ఉంటే మెగాస్టార్‌కు ఓటీటీ రీచ్ దక్కేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాబీ తెరకెక్కిస్తున్న కాకాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

By - Sivaji Kontham
Update: 2026-11-26 04:23 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో `ది ఫ్యామిలీమ్యాన్` ప్రాజెక్ట్ విషయంలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం ఇటీవ‌ల సోషల్ మీడియాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తొలుత దీనిని సినిమాగా తీయాలనుకుని చిరంజీవిని సంప్రదించిన విష‌యం తెలిసిన‌దే. కానీ ఆ కథను వెబ్ సిరీస్‌గా మలిస్తే బాగుంటుందని చిరు స్వయంగా ద‌ర్శ‌క‌ద్వ‌యానికి సూచించారు. ఆ సలహామేరకు సిరీస్‌గా తెరకెక్కించ‌గా ఈ ప్రాజెక్ట్ నటీనటులకు, ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే స‌హా సాంకేతిక నిపుణులకు భారీ విజయాన్ని అందించ‌డ‌మే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ పాపుల‌ర్ చేసింది.

నిజానికి మెగాస్టార్ న‌టించిన‌ `సైరా నరసింహారెడ్డి` వంటి భారీ పాన్ ఇండియన్ చిత్రంతో పోలిస్తే `ది ఫ్యామిలీమ్యాన్` ఫ్రాంఛైజీకి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా విశేష ఆదరణ దక్కింది. ఓటీటీ వేదికల ద్వారా లభించిన గ్లోబల్ రీచ్ ఈ సిరీస్‌లో నటించిన తారలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సిరీస్‌తో మనోజ్ బాజ్‌పాయ్ ఇమేజ్- క్రేజ్ అమాంతం పెరిగాయని.. మిగతా నటీనటులకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.

మరోవైపు..ప్రస్తుత కాలంలో పాన్ ఇండియా స్థాయిలో వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్న నటీనటుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ విషయంలో వచ్చిన అవకాశాన్ని చిరంజీవి వదులుకోవడం వల్ల ఆయనకు కొంతమేర రీచ్ పరంగా నష్టం జరిగిందనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఓటీటీ ట్రెండ్ వేగంగా మారుతున్న వేళ.. ఆ మాధ్యమాన్ని అందిపుచ్చుకోక‌పోవ‌డం పెద్ద స్టార్ల‌కు కూడా వెన‌క‌బాటుగా మారుతోందనే విశ్లేష‌ణ సాగుతోంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి అనుభ‌వంతో చేసే ఆలోచనలు, సలహాలు ఎంతో విలువైనవని.. అవి గతంలో ఎందరికో ఎంతో మేలు చేశాయని అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఇతరులకు మంచి జరగాలని.. వారికి అవకాశం దక్కాలని కోరుకునే స్వభావం ఆయనది కావడంతో.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఎక్కువగా విశ్లేషణలు చేయ‌డం సరికాదనే వాదన కూడా బలంగా ఉంది.

ఏదేమైనా ఒకవేళ చిరంజీవి `ది ఫ్యామిలీమ్యాన్` సిరీస్‌లో భాగమై ఉండుంటే.. మెగాస్టార్ క్రేజ్‌కు ఓటీటీ గ్లోబల్ రీచ్ తోడై మరో కొత్త చరిత్రకు శ్రీ‌కారం చుట్టిన‌ట్టు ఉండేద‌నే చర్చ సినీ ప్రియుల్లో కొనసాగుతోంది. అయితే ఆ లోటును పూడ్చేందుకు బాస్ కోసం రాజ్ అండ్ డీకే మ‌రో అద్భుత‌మైన సిరీస్ ను లేదా సినిమాల‌ను క్రియేట్ చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్ర‌పంచంలోనే గొప్ప వెర్స‌టైలిటీ ఉన్న స్టార్ మెగాస్టార్. ఆయ‌న స్థాయిని మ‌రింత పెంచేలా మునుముందు ప్రాజెక్టుల రూప‌క‌ల్ప‌న జ‌ర‌గాల‌ని కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఫ్యామిలీమ్యాన్ అవ‌కాశాన్ని వ‌దులుకున్నా కానీ.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు బాబి తెర‌కెక్కిస్తున్న `కాకా`లో ఒక స‌మాధానం దొరుకుతుంద‌నే చ‌ర్చ కూడా అభిమానుల్లో సాగుతుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Tags:    
  • chiranjeevi 
  • thefamilyman 
  • rajanddk 
  • bobby 
  • kaaka 

Similar News

చైతూ ‘వృషకర్మ’ ట్రైలర్.. అద్భుతమైన విజువల్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితం!

2026-11-26 04:29 GMT

భర్తతో కలిసి థాయ్‌లాండ్ టూర్.. ప్రియా భవానీ శంకర్ ఫోటోలు వైరల్!

2026-11-26 04:23 GMT

ప్ర‌భాస్-ర‌ణ‌వీర్-ర‌ణబీర్ ఈ ముగ్గురికీ ఒక‌టే స‌మ‌స్య‌!

2026-11-26 03:54 GMT

వృషకర్మపై చైతు కాన్ఫిడెన్స్.. ఆ మాటే హైలెట్..

2026-11-26 03:53 GMT

ఆస్కార్స్- 2027 రేసులో 'రామాయణ'.. హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో ఢీ

2026-11-26 03:53 GMT

బంధిఖానా నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేము.. పెళ్లిపై నిత్యామీన‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

2026-11-26 03:53 GMT

స‌న్‌గ్రూప్ ఉద్యోగుల‌తో అల్లుడు అనిరుధ్ ఆప్యాయ‌త‌- సింప్లిసిటీ!

2026-11-26 03:52 GMT

సాయి పల్లవి మరో ప్రయోగం.. పొట్టి జుట్టుతో గర్భిణీగా కనిపించి షాక్ ఇచ్చిన హీరోయిన్!

2026-11-26 03:51 GMT

Bigg Boss Telugu 10: డెమన్ పవన్, రీతూ, శోభా శెట్టి & టేస్టీ తేజ ఎంట్రీ!

2026-11-26 03:50 GMT

వంశీ పైడిపల్లికి కలలో కూడా ఊహించని గిఫ్ట్.. ఇదీ సల్మాన్ రేంజ్ అంటే!

2026-11-25 17:54 GMT

రిలీజ్ కు ముందే 100 మార్కులు వేసిన గ్రేట్ మామ్!

2026-11-25 17:48 GMT

Copyright @2026

Powered by Blink CMS