భర్తతో కలిసి థాయ్‌లాండ్ టూర్.. ప్రియా భవానీ శంకర్ ఫోటోలు వైరల్!
| నటి ప్రియా భవానీ శంకర్ తన భర్త రాజవేల్‌తో కలిసి థాయ్‌లాండ్‌కు స్పాంటేనియస్ ట్రిప్ వెళ్లారు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో అనుకున్న ఆలోచనతో అదే రాత్రి విమానం ఎక్కినట్లు వెల్లడించారు. 2018లో ప్రేమికులుగా తొలిసారి వెళ్లిన థాయ్‌లాండ్‌కు ఇప్పుడు భార్యాభర్తలుగా వెళ్లడం ప్రత్యేకమని తన పోస్టులో పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
సెలబ్రిటీ వెకేషన్ అంటే నెలల ముందే ప్లాన్ చేసుకునే లగ్జరీ ట్రిప్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ప్రియా భవానీ శంకర్ ఇందుకు పూర్తి భిన్నం. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర సరదాగా అనుకున్న ఒక చిన్న ఆలోచన, అదే రోజు రాత్రికి థాయ్‌లాండ్ ఫ్లైట్ ఎక్కేలా చేసింది. చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ జంట, ఇప్పుడు తమ అప్పటికప్పుడు వేసుకున్న ప్రయాణపు కబుర్లతో పోస్టు పెట్టింది ..ఆ విశేషాలు చూద్దాం..
ఎనిమిదేళ్ల జ్ఞాపకాలకు కొత్త రూపు:
ప్రియా, రాజవేల్ ప్రేమ ప్రయాణంలో థాయ్‌లాండ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2018లో వీరిద్దరూ కలిసి వెళ్లిన మొదటి విదేశీ ట్రిప్ ఇదే. అయితే ఆ పాత జ్ఞాపకాలను కేవలం గుర్తుచేసుకోవడమే కాకుండా, ఈసారి ఉత్తర థాయ్‌లాండ్‌లోని కొత్త ప్రదేశాలను చూడటానికి వీరు ఆసక్తి చూపారు. ఇక ఒకప్పుడు ప్రేమికులుగా అడుగుపెట్టిన చోటుకే, ఇప్పుడు భార్యాభర్తలుగా వెళ్లడం వారి ప్రయాణంలో వచ్చిన అందమైన మార్పును చూపిస్తోంది.
ప్లానింగ్ లేని ప్రయాణమే అసలైన మజా:
సాధారణంగా స్టార్ హీరోయిన్ల షెడ్యూల్స్ చాలా బిజీగా ఉంటాయి. వరుస షూటింగ్‌ల మధ్య ఇలా "ఈ రాత్రే వెళ్లిపోదామా?" అని నిర్ణయం తీసుకోవడం చాలా అరుదు. ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా, కేవలం మనసుకు నచ్చినట్టు సాగే ఇలాంటి 'స్పాంటేనియస్ ట్రిప్స్' వల్లే నిజమైన రిలాక్సేషన్ దొరుకుతుందని ప్రియా పోస్ట్ చెబుతోంది. ఇక మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపిస్తోందని ఆమె చెప్పిన మాటలు ఆ ప్రదేశం వారిపై వేసిన ముద్రను స్పష్టం చేస్తున్నాయి.
కెరీర్ జోరులో చిన్న విరామం:
టీవీ సీరియల్ 'కళ్యాణం ముదల్ కాదల్ వరై'తో మొదలైన ప్రియా ప్రయాణం, 'మేయాద మాన్' సినిమాతో వెండితెరకు మారింది. 'తిరుచిత్రంబలం', 'డీమాంటీ కాలనీ 2', 'జీబ్రా' లాంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం రవితేజ సరసన 'ఇరుముడి'తో పాటు 'డీమాంటీ కాలనీ 3', 'అహం బ్రహ్మాస్మి' లాంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ఇక ఇంతటి పని ఒత్తిడి మధ్య తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం ఆమెలోని పరిణతిని చూపిస్తుంది. ఇక పెద్దగా ఆడంబరాలు లేకుండా తనకు నచ్చినట్టు బతకడం ప్రియా భవానీ శంకర్ స్టైల్. పెళ్లయినా, కెరీర్లో ఎంత ఎత్తుకు ఎదిగినా తనలోని సాదాసీదా తత్వాన్ని కోల్పోకుండా ఉండటమే గ్రేట్ అంటున్నారు ఫాన్స్ .