• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్‌తో 'భగవంత్...

ఎన్టీఆర్‌తో 'భగవంత్ కేసరి' కాదట..!

| ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కామెడీ ప్రధానంగా సాగుతుందని అనిల్ రావిపూడి వెల్లడించినట్లు సమాచారం. ‘అదుర్స్’ తరహాలో ఎన్టీఆర్ కామెడీ యాంగిల్‌ను చూపిస్తూనే, అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. 2028 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించడంతో పాటు గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By - Ramesh Palla
Update: 2026-11-26 05:56 GMT

ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం డ్రాగన్‌ మూవీ రూపొందుతున్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతున్న డ్రాగన్‌ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అదే స్థాయిలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్‌ సంక్రాంతి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం 'జనవరి 12 విడుదల' సినిమాను చేస్తున్నాడు. వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. 2028 సంక్రాంతికి ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమాను విడుదల చేసేందుకు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మూవీ...

అనిల్ రావిపూడి సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్‌ తో అనిల్ రావిపూడి చేయబోతున్న సినిమా కామెడీ నేపథ్యం అయి ఉంటుందా లేదంటే భగవంత్‌ కేసరి మాదిరిగా సీరియస్‌గా సాగుతుందా అనే చర్చ మొదలైంది. బాలకృష్ణతో అనిల్‌ రావిపూడి తీసిన భగవంత్‌ కేసరి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ఈయన కామెడీ సినిమాలు మాత్రమే కాదు ఇలాంటి సీరియస్‌, మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేయగలడని నిరూపించుకున్నాడు. అందుకే భగవంత్‌ కేసరి సినిమా తరహాలో ఎన్టీఆర్‌ తో సీరియస్ మూవీని అనిల్‌ రావిపూడి చేసే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది. సోషల్‌ మీడియాలోనూ ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరిగింది. ఫైనల్‌ గా ఈ విషయాన్ని గురించి దర్శకుడు అనిల్‌ రావిపూడి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ కామెడీ యాంగిల్‌తో మూవీ...

ఎన్టీఆర్‌లో మంచి కామెడీ యాంగిల్‌ ఉంటుంది. ఆయన్ను కామెడీ యాంగిల్‌లో చాలా తక్కువ సినిమాల్లో చూశాం. గత పదేళ్లుగా ప్రతి సినిమాలోనూ ఎన్టీఆర్‌ సీరియస్‌గానే కనిపిస్తూ వచ్చాడు. అందుకే అనిల్ రావిపూడి ఆయన ఫ్యాన్స్ కోసం అదుర్స్ వంటి ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ మూవీని ప్లాన్‌ చేస్తున్నాడట. గత పదేళ్ల నుంచి ఎన్టీఆర్‌లో ఏదైతే మిస్‌ అవుతున్నారో దాన్ని ఈ సినిమాలో అందిస్తాను అంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఫ్యాన్స్‌ కోరుకునే మాస్‌ ఎలిమెంట్స్‌ తో పాటు, కామెడీ యాంగిల్‌ సైతం ఉండే విధంగా స్క్రిప్ట్‌ రెడీ అవుతుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ స్కేల్‌ కి సరిపోయే అన్ని ఎలిమెంట్స్‌ను ఈ సినిమాలో అనిల్ రావిపూడి పెట్టి మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. గతంలో మహేష్‌ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా మాదిరిగా ఎన్టీఆర్‌ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

జనవరి 12 విడుదల కోసం...

అనిల్ రావిపూడి అనగానే సంక్రాంతి సినిమా గుర్తుకు వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమాలు సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్‌ వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో జనవరి 12 విడుదల సినిమా విషయంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్‌ రామ్‌ పాత్ర ఈ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉంటుందని, ఆయనకు ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్‌ పడబోతుందనే విశ్వాసంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌, అనిల్‌ రావిపూడి కాంబోలో రూపొందబోతున్న సినిమాను కళ్యాణ్ రామ్‌ నిర్మించడం మాత్రమే కాకుండా గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడని సమాచారం అంందుతోంది. కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ లు స్క్రీన్‌ పై కలిసి కనిపిస్తే అది నందమూరి ఫ్యాన్స్ కి కచ్చితంగా పండగే అనడంలో సందేహం లేదు. ఆ అరుదైన కలయిక చూపించడం కచ్చితంగా అనిల్ రావిపూడి కే సాధ్యం అనడంలో సందేహం లేదు. కనుక ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ తో పాటు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • ntr 
  • anilravipudi 
  • kalyanram 
  • dragonmovie 

Similar News

శ్రీదేవి..మిథున్ బంధంపై లారెన్స్ ఆసక్తికర విషయాలు !

2026-11-26 05:38 GMT

భోగి ఈవెంట్స్‌కు ఎందుకు రావడం లేదు? క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్

2026-11-26 05:37 GMT

టాలీవుడ్ సంక్రాంతి బరిలో ఊహించని ట్విస్ట్.. స్టార్ హీరో సినిమా వెనక్కి!

2026-11-26 05:16 GMT

5 వేల ఏళ్ల నాటి రహస్యం.. నాగచైతన్య వృషకర్మ ట్రైలర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

2026-11-26 04:29 GMT

మెగాస్టార్ కెరీర్ హిస్ట‌రీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదేనా?

2026-11-26 04:23 GMT

భర్తతో కలిసి థాయ్‌లాండ్ టూర్.. ప్రియా భవానీ శంకర్ ఫోటోలు వైరల్!

2026-11-26 04:23 GMT

ప్ర‌భాస్-ర‌ణ‌వీర్-ర‌ణబీర్ ఈ ముగ్గురికీ ఒక‌టే స‌మ‌స్య‌!

2026-11-26 03:54 GMT

వృషకర్మపై చైతు కాన్ఫిడెన్స్.. ఆ మాటే హైలెట్..

2026-11-26 03:53 GMT

ఆస్కార్స్- 2027 రేసులో 'రామాయణ'.. హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో ఢీ

2026-11-26 03:53 GMT

బంధిఖానా నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేము.. పెళ్లిపై నిత్యామీన‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

2026-11-26 03:53 GMT

స‌న్‌గ్రూప్ ఉద్యోగుల‌తో అల్లుడు అనిరుధ్ ఆప్యాయ‌త‌- సింప్లిసిటీ!

2026-11-26 03:52 GMT

Copyright @2026

Powered by Blink CMS