ఉస్తాద్ పాప కిల్లర్ లుక్!
ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ స్టన్నింగ్ లుక్ బయటకు వచ్చింది. గన్ పట్టుకున్న శ్రీలీల ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.;
టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా గుర్తింపు అందుకుంటున్న శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా మారింది. గుంటూరు కారం సినిమాతో మరోసారి అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం పలు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ స్టన్నింగ్ లుక్ బయటకు వచ్చింది. గన్ పట్టుకున్న శ్రీలీల ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ చేతితో గన్‌ను పట్టుకుని.. తన కళ్ళతో మైమరపించేలా చూపించగా, ఆమె ముకానికి పెట్టిన చిన్న బొట్టు, సంప్రదాయ సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచింది. అదే సమయంలో గన్ లుక్ ఆమెలోని రఫ్ అండ్ ఫైర్ యాంగిల్‌ను హైలైట్ చేస్తోంది.
ఈ ఫొటోను సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ క్లిక్ చేయగా.. నెటిజన్లు ఆమె లుక్‌పై ఫిదా అవుతున్నారు. కళ్ళలోని ఫైర్, హావభావాలు ఈ లుక్‌కి అదనపు ఆకర్షణను తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకూ శ్రీలీల కనిపించిన పాత్రల్లో ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. గ్లామర్‌తో పాటు యాక్షన్ డోస్ కూడా పెరగబోతోందని భావిస్తున్నారు.
ఇప్పటికే గ్లామర్ పాత్రల్లో మెప్పించిన శ్రీలీల.. ఈసారి పవర్‌ఫుల్ రోల్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ రావడం.. ఆమె కెరీర్‌కి బిగ్ బ్రేక్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్‌గా జరుగుతుండగా.. ఆమె యాక్టివ్ సోషల్ మీడియా ప్రెజెన్స్ కూడా అభిమానుల్లో క్రేజ్‌ను మరింత పెంచుతోంది.
ఇక శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆమె జూనియర్, మాస్ జాతర వంటి సినిమాల్లో కూడా కనిపించబోతోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న శ్రీలీల, గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా చూపిస్తూ అగ్ర హీరోయిన్ల జాబితాలో నిలవబోతున్నదనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్నదానిపై మాత్రం అభిమానుల్లో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.