శ్రీలీల మరోసారి సై అంటుందా?
కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీలీల, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు.;
కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీలీల, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే యాక్టింగ్, తన డ్యాన్సులతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన శ్రీలీల ఆ తర్వాత రవితేజకు జోడీగా ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
ధమాకా తర్వాత శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎన్నో సినిమాల్లో నటించి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన శ్రీలీల క్రేజ్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది.
ఇవన్నీ ఒకెత్తయితే ఓ వైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ సరసన కిస్సిక్ సాంగ్ చేసి నేషనల్ వైడ్ పాపులైరయ్యారు శ్రీలీల. ఇంకా చెప్పాలంటే కిస్సిక్ సాంగ్ చేశాక శ్రీలీల క్రేజ్, మార్కెట్ మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఆల్రెడీ పుష్ప2 లో చేసిన స్పెషల్ సాంగ్ తనకు మంచి గుర్తింపును ఇవ్వడంతో ఇప్పుడు శ్రీలీల మరో స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు కలయికలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ ను టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీలతో చేయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నిజంగా శ్రీలీల ఈ సాంగ్ చేస్తే సినిమాకు ఈ సాంగ్ చాలా ప్లస్సయ్యే ఛాన్సుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.