శ్రీలీల: రెడ్ కలర్ చీరలో ధమాకా లుక్

టాలీవుడ్‌లో తన సొగసైన నటనతో పాటు స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్న శ్రీలీల, తాజాగా రెడ్ కలర్ చీరలో చేసిన ఫొటోషూట్‌తో మరోసారి హైలైట్ అయ్యింది.;

Update: 2025-09-10 17:34 GMT

టాలీవుడ్‌లో తన సొగసైన నటనతో పాటు స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్న శ్రీలీల, తాజాగా రెడ్ కలర్ చీరలో చేసిన ఫొటోషూట్‌తో మరోసారి హైలైట్ అయ్యింది. సింపుల్ అండ్ క్యూట్ స్టైల్‌లో కనిపించిన ఈ లుక్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, నిమిషాల్లోనే లక్షల లైక్స్ దక్కించుకుంది. "నిశ్శబ్దంలో రాసిన కథ" అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆమె లుక్‌కి సరిపోయేలా ఉంది.

ఎరుపు చీరలో శ్రీలీల కాన్ఫిడెన్స్, ఆమె అందాన్ని మరింత మెరుగు పరచింది. డిజైనర్ బ్లౌజ్, మినిమల్ మేకప్‌తో తీసుకున్న ఫొటోలు సొగసుతో పాటు గ్లామర్ టచ్‌ను చూపిస్తున్నాయి. స్మైల్‌తో ఇచ్చిన పోజులు, ఆమె ఫోటోషూట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ లుక్‌కి నెటిజన్లు మంచి రెస్పాన్స్ ఇస్తూ, "లేడీ క్రష్ ఆఫ్ ది డే" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే, "పెల్లిసందడి" సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఆమె, మొదటి నుంచే మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత "ధమాకా"లో రవితేజ పక్కన నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. వరుసగా వచ్చిన "భగవంత్ కేశరి" వంటి సినిమాలు ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ప్రత్యేకంగా చెప్పాలంటే, శ్రీలీలకు ఉన్న యాక్టింగ్ టాలెంట్‌తో పాటు ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఆమె ఎంచుకునే డ్రెస్సులు, ఫొటోషూట్‌లలో చూపించే స్టైల్, గ్లామర్ టచ్ హైలెట్. ఈ కారణంగానే ఆమె ప్రతి అప్‌డేట్ ట్రెండింగ్ అవుతుంది. మొత్తంగా చూస్తే, శ్రీలీల తన కెరీర్ ప్రారంభ దశలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ అదే క్రేజ్‌ను కొనసాగిస్తూ, ప్రతి కొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News