జగపతిబాబునే బెదిరించిన శ్రీ లీల.. లీలలు చాలనే ఉన్నాయే!
తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా షో కి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ కి శ్రీ లీల గెస్ట్ గా వచ్చింది.. ఈ షోకి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు.;
ఒక హీరో లేదా హీరోయిన్ హోస్ట్ గా ఏదైనా షో చేస్తున్నారంటే ఆ షోకి భారీ పాపులారిటీ వస్తుంది.అంతేకాదు ఆ షోకి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా గెస్ట్లుగా వస్తారు. అలా ఇప్పటికే సమంత,రానా, బాలకృష్ణ, మంచు లక్ష్మి వంటి ఎంతోమంది సెలబ్రిటీలు టాక్ షోలకు హోస్టులుగా చేసి ఎంతోమంది సెలెబ్రిటీలను గెస్ట్లుగా ఆహ్వానించారు. అలా తాజాగా జగపతిబాబు వంతు వచ్చింది. ఆయన జీ తెలుగులో 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే కొత్త టాక్ షోతో మన ముందుకు వచ్చారు. ఇప్పటికే నాగర్జున గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తయ్యింది. అయితే సెకండ్ ఎపిసోడ్ కి గెస్ట్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా ఇండస్ట్రీలో ఎదుగుతున్న శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది.
అయితే శ్రీలీలను చూడడంతోనే అక్కడున్న వాళ్ళందరూ తెగ సంబరపడిపోయారు. "అచ్చ తెలుగు ఆడపిల్ల మన శ్రీలీల రాబోతుంది" అని జగపతిబాబు చెప్పడంతోనే శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఈ షోకి శ్రీలీల ఒక్కతే కాదు. ఆమె తల్లి కూడా వచ్చారు.ఇదిలా ఉండగా.. ఈ షో కి సంబంధించిన ప్రోమోలో జగపతిబాబునే బెదిరించింది శ్రీలీల.. మరి జగపతిబాబుని శ్రీలీల ఎందుకు బెదిరించింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా షో కి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ కి శ్రీ లీల గెస్ట్ గా వచ్చింది.. ఈ షోకి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో భాగంగా జగపతిబాబు.. " మేమందరం ఇండస్ట్రీకి వచ్చి. యాక్టింగ్ నేర్చుకుంటే.. నువ్వేమో యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీకి వచ్చావు" అనడంతో.. శ్రీలీల.. "అసలు మీరు ఇప్పుడు నన్ను తిట్టారా? పొగిడారా? అంటూ క్యూట్ గా ప్రశ్నిస్తుంది. మిమ్మల్ని శ్రీలీల అని పిలవాలా.. ఏమని పిలవాలి అని జగ్గూ భాయ్ అడిగితే.. లీలా అని పిలవండి అంటుంది. దానికి జగ్గూ భాయ్.. "మీలో చాలా లీలలు ఉన్నాయి..ఏ లీలా అని పిలవాలి" అంటూ జగపతిబాబు పంచ్ విసిరారు.ఇక ఆయన మాటలకి శ్రీ లీల దండం పెడుతూ వద్దు సార్ అన్నట్లుగా మాట్లాడింది.
అలాగే గుంటూరు కారం చేసేటప్పుడు నీ ఫేస్ లో లెఫ్ట్ లోనో రైట్ లోనో కాస్త తేడా ఉండేది అని అడుగుతాడు. అయితే శ్రీలీలను జగపతిబాబు ఏదో విషయం గురించి అడిగితే.. ఆ టాపిక్ తీయకండి సార్..అది తీస్తే నేను మీ టాపిక్ తీయవల్సి వస్తుంది అంటూ బెదిరించినట్లుగా మాట్లాడింది. ఏం టాపిక్ అని తెలియనట్లుగా జగపతి బాబు అడగగా.. మీ హీరోయిన్ గారు మీరు అంటూ సైగలు చేస్తూ మాట్లాడింది. ఇక ఈ విషయాలు ఇప్పుడు ప్రోమోలో హైలెట్ గా మారుతున్నాయి.
ఆ తర్వాత.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేసావు అని జగపతిబాబు అనగా.. దూల తీరిపోతుంది అంటూ శ్రీలీల ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్ గా మారాయి. అలాగే ఈ ప్రోమోలో నీ మీద ఓ కంప్లైంట్ ఉందమ్మా అని జగపతిబాబు అనగా వామ్మో అంటూ శ్రీ లీల ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీలీల తల్లి కూడా షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో జగపతిబాబు మీరు హీరోయిన్ అవుదామని మీ కూతుర్ని హీరోయిన్ ని చేశారా అని అడుగుతారు. దానికి శ్రీలీల తల్లి నేను మీకు పెద్ద అభిమానిని అంటూ చెబుతుంది. అలా పలు విషయాలపై చర్చించారు. అయితే శ్రీలీల గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ జీ ఫైవ్ లో ఆగస్టు 22న అలాగే జీ తెలుగులో ఆగస్టు 24న స్ట్రీమింగ్ కాబోతోంది. ఒక్క ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ పై అంచనాలను పెంచారు. మరి చూడాలి ఈ ఎపిసోడ్ లో శ్రీలీల నుండి ఇంకా ఎన్ని సీక్రెట్లు రాబడుతారో.