బెల్లంకొండ 'కిష్కింధపురి'.. శ్రీలీల క్రేజీ రివ్యూ
నిర్మాత సాహు గారపాటి తో పాటు హీరో హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ సహా మూవీ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు శ్రీలీల.;
యంగ్ అండ్ స్టార్ బ్యూటీ శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ చేసే అమ్మడు.. తన సినిమాల అప్డేట్స్ ను ఇస్తూనే ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో వాల్స్ లో శ్రీలీల చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ తరచూ కనిపిస్తూనే ఉంటాయి.
అయితే ఇప్పుడు ఆమె.. కిష్కింధపురి మూవీ రివ్యూ ఇచ్చారు. అది చాలా అరుదైన విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు వేరే సినిమాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ పెద్దగా పోస్టులు పెట్టలేదు. కానీ ఇప్పుడు కిష్కింధపురికి ఫిదా అయినట్లు ఉన్నారు. మూవీ బాగా నచ్చి సినిమా కోసం తాజాగా స్పెషల్ పోస్ట్ చేశారు.
ఎంతో ఉత్కంఠభరితమైన సినిమా కిష్కింధపురి అని కొనియాడిన శ్రీలీల.. స్పైన్ చిల్లింగ్ రైడ్ అంటూ చెప్పుకొచ్చింది. సినిమాలోని భయానక వాతావరణం, భయానక దృశ్యాలు, ట్విస్టులు అన్నీ కలిపి అద్భుతమైన అనుభవంగా మార్చాయని పోస్ట్ చేశారు. అంతే కాదు ప్రత్యేక అభినందనలు కూడా చెప్పారు అమ్మడు.
నిర్మాత సాహు గారపాటి తో పాటు హీరో హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ సహా మూవీ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు శ్రీలీల. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడికి కిష్కింధపురి సినిమా ఫుల్ గా నచ్చినట్లు ఉందని సినీ ప్రియులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే శ్రీనివాస్- అనుపమతో ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోని శ్రీలీల.. సాహు గారపాటితో మాత్రం వర్క్ చేశారు. ఆయన నిర్మించిన భగవంత్ కేసరి మూవీలో నటించారు. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన శ్రీలీల తన నటనతో ఆకట్టుకున్నారు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా సొంతం చేసుకోవడం విశేషం.
ఇక కిష్కింధపురి విషయానికొస్తే.. హారర్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాలో సాయి శ్రీనివాస్, అనుపమ లీడ్ రోల్స్ లో నటించారు. తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, శాండీ మాస్టర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, సాహు గారపాటి నిర్మించారు. మంచి హిట్ కూడా అందుకున్నారు.