శ్రీలీల మనసు గెలవాలంటే.. ఆ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందేన‌ట‌!

తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో వేగంగా స్టార్‌డమ్‌ను అందుకున్న హీరోయిన్ శ్రీలీల మరోసారి తన వ్యక్తిగత అభిప్రాయాలతో వార్తల్లో నిలిచింది.

Update: 2026-07-04 18:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో వేగంగా స్టార్‌డమ్‌ను అందుకున్న హీరోయిన్ శ్రీలీల మరోసారి తన వ్యక్తిగత అభిప్రాయాలతో వార్తల్లో నిలిచింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అభిమానులతో త‌న ఆలోచనలను పంచుకుంటూ ఉంటుంది. ఆ ఆలోచ‌న‌లు అనుకోకుండా సోషల్ మీడియాలో మంచి చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా రిలేషన్‌షిప్, ఫ్యూచ‌ర్ లైఫ్ పార్ట‌న‌ర్ గురించి ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ సంద‌ర్భంగా శ్రీలీలను రిలేషన్‌షిప్‌పై మీ అభిప్రాయం ఏమిటి? మీకు కాబోయే జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని భావిస్తారు? అని ప్రశ్నించగా, ఆమె త‌న స‌మాధానాన్ని చాలా సింపుల్‌గానే, క్లారిటీగా చెప్పింది. తాను ఒక సెన్సిబుల్, సెన్సిటివ్ అలాగే మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉన్న వ్యక్తిని కోరుకుంటాన‌ని చెప్పింది. శ్రీలీల చెప్పిన ఈ మూడు క్వాలిటీస్ లో మొదటిది సెన్సిబిలిటీ. జీవితంలో ప్రతి పరిస్థితిని ఆలోచించి డెసిష‌న్స్ తీసుకునే పరిపక్వత ఉన్న వ్యక్తి కావాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం ఎమోష‌న్స్ తో కాకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తిత్వానికి ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే రెండో ముఖ్యమైన లక్షణంగా సెన్సిటివ్ నేచర్ గురించి మాట్లాడింది. ఎదుటివారి భావాలను గౌరవించడం, వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు మానసికంగా అండగా నిలవడం వంటి లక్షణాలు ఒక బలమైన బంధానికి ఎంతో అవసరమని ఆమె అభిప్రాయంలో ప్రతిబింబించింది. ఇక మూడో అంశంగా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలని చెప్పడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. లైఫ్ లో ఎంత ప్రెజ‌ర్ ఉన్నా, నవ్విస్తూ పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించగల వ్యక్తి ఉంటే రిలేషన్‌షిప్ మరింత అందంగా ఉంటుందని ఆమె మాటల్లో అర్థమవుతోంది. శ్రీలీల సమాధానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా శ్రీలీల ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై పలు రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఆమె రిలేషన్‌లో ఉందంటూ తరచూ కథనాలు వస్తున్నప్పటికీ, వాటికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అందువల్ల అవి కేవలం ఊహాగానాలుగానే కొనసాగుతున్నాయి.

ఇక కెరీర్ పరంగా చూస్తే గతంలో పలు పెద్ద సినిమాల్లో నటించిన శ్రీలీల‌, ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలేషన్‌షిప్ గురించి ఆమె వెల్లడించిన అభిప్రాయాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రేమ, పెళ్లి విషయంలో రూపం లేదా హోదా కంటే వ్యక్తిత్వం, పరస్పర గౌరవం, సంతోషంగా జీవించే స్వభావానికే ఆమె ఎక్కువ విలువ ఇస్తోందనే సందేశాన్ని ఆమె మాట‌లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Tags:    

Similar News