చక్కనమ్మకు లక్కు చిక్కట్లేదే..!

ధమకా బ్యూటీ శ్రీలీల దూకుడు తగ్గిందనే చెప్పాలి. స్టార్ సినిమాలతో మొన్నటిదాకా సందడి సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఒక్క సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది.;

Update: 2026-01-05 06:16 GMT

ధమకా బ్యూటీ శ్రీలీల దూకుడు తగ్గిందనే చెప్పాలి. స్టార్ సినిమాలతో మొన్నటిదాకా సందడి సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఒక్క సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. తెలుగులో ఊహించని విధంగా స్టార్ డం తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస ఫ్లాపుల వల్ల గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కెరీర్ టఫ్ అవుతున్న ఈ టైంలో అమ్మడికి కచ్చితంగా లక్ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తుంది శ్రీలీల. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తుంది అమ్మడు.

తమిళ్ లో శ్రీలీల హవా కొనసాగించాలంటే..

మరోపక్క కోలీవుడ్ లో శ్రీలీల పరాశక్తి సినిమాతో వస్తుంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో శ్రీలీల హవా కొనసాగించాలంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాల్సిందే. ఇవే కాకుండా బాలీవుడ్ లో అమ్మడు చేస్తున్న మొదటి సినిమా కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. అనురాగ్ బసు డైరెక్షన్ లో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల చేస్తున్న సినిమా ఇప్పటికే ఆషికి ఫ్రాంచైజ్ అనే టాక్ వచ్చింది.

హిందీలో హిట్ పడితే శ్రీలీల కెరీర్ అక్కడ దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఆ సినిమా ఎంతవరకు వచ్చింది అన్నది ఎప్పుడు రిలీజ్ అన్నది ఇంకా తేలలేదు. ఇలా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో శ్రీలీల మరోసారి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఐతే చక్కనైన చుక్క లాంటి ఈ అమ్మడికి లక్ ఒక్కటే చిక్కట్లేదు అనిపిస్తుంది. అందం, అభినయం రెండిటితో పాటు డ్యాన్స్ లతో దుమ్ము దులిపేసే శ్రీలీలకు లక్ ఫేవర్ చేస్తే మాత్రం కచ్చితంగా సత్తా చాటే ఛాన్స్ ఉంటుంది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలు..

శ్రీలీల తిరిగి ఫాంలోకి వస్తే తెలుగులో కూడా ఆమెకు మరిన్ని క్రేజీ ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంటుంది. చివరగా రవితేజతో మాస్ జాతర సినిమా చేసిన శ్రీలీల ఉస్తాద్ తర్వాతనే మరో సినిమా సైన్ చేయాలని చూస్తుంది. తెలుగు నుంచి పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమాలకు తన మొదటి ప్రాధాన్యత ఇస్తుంది శ్రీలీల. తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాలు చేస్తున్న అమ్మడు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అందరి మనసులు గెలుచుకోవాలని చూస్తుంది.

టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ స్టేటస్ అందుకున్న శ్రీలీల కథల ఎంపికలో కాస్త జాగ్రత్త పడితే బాగుంటుంది. స్టార్ సినిమాల్లో కేవలం పాటలు, డ్యాన్స్ ల కోసం అన్నట్టు అయితే మాత్రం అమ్మడు వెనకబడే ఛాన్స్ ఉంటుంది.

తెలుగులో మిగతా హీరోయిన్స్ తో పాటు శ్రీలీల టఫ్ ఫైట్ ఇస్తున్నా వరుస ఫ్లాప్ ల వల్ల ఆమెతో సినిమా చేయాలంటే ఆలోచిస్తున్నారు మేకర్స్. అందుకే ఒక్క హిట్టు పడితే అమ్మడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేస్తుంది.

Tags:    

Similar News