ఇండ‌స్ట్రీలో క్రేజీ డాట‌ర్ అండ్ మ‌ద‌ర్!

తెలుగ‌మ్మాయి శ్రీలీల చ‌లాకీత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆన్ స్క్రీన్ పైనే కాదు..ఆఫ్ ది స్క్రీన్ లోనూ అమ్మ‌డు అంతే యాక్టివ్ గా..చ‌లాకీగా ఉంటుంది.;

Update: 2025-04-21 10:30 GMT

తెలుగ‌మ్మాయి శ్రీలీల చ‌లాకీత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆన్ స్క్రీన్ పైనే కాదు..ఆఫ్ ది స్క్రీన్ లోనూ అమ్మ‌డు అంతే యాక్టివ్ గా..చ‌లాకీగా ఉంటుంది. న‌లుగురిలో ఇట్టే క‌లిసిపోతుంది. తానో హీరోయిన్ అనే భావ‌న ఎక్క‌డా చూపించ‌దు. చిన్న పిల్ల‌లు క‌నిపిస్తే తాను చిన్న పిల్ల‌లా మారిపోతుంది. తోటి న‌టీను టుల‌పై స‌ర‌దాగా జోకులేస్తుంది. త‌నపై ఎవ‌రు జోకులేసిని వాటిని అంతే స‌ర‌దాగా తీసుకుంటుంది.


ఇదంతా అంద‌రికీ తెలుసు. మ‌రి మామ్ తో శ్రీలీల ఎలా ఉంటుందంటే? అమ్మ అంటే చాలా భ‌య‌మ‌ని ఇప్ప‌టికే రివీల్ చేసింది. చిన్న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అదే భ‌యాన్ని కంటున్యూ చేస్తుంద‌ని చెప్పుకొచ్చింది. కానీ ఎంత గారం? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదుగా. అందుకు సాక్షమే ఈ వీడియో. ఇదిగో ఇక్క‌డిలో కూతురుకు గారాబంగా పాయ‌సం తినిపిస్తూ కుమార్తెపై ప్రేమ‌ను చాటుకుంది.

ఆ స‌మ‌యంలో శ్రీలీల అమ్మ‌ను ఆట‌ప‌ట్టిస్తూ మ‌రీ పాయ‌సం తింటుంది. మ‌మ్మి స్పూన్ నోటి ద‌గ్గ‌ర పెడితే కూతురు మూతి అటు ఇటు తిప్పుతు మారాం చేస్తుంది. హీరోయిన్- హీరోయిన్ త‌ల్లికి సంబంధించి ఇలాంటి వీడియో బ‌య‌ట‌కు రావ‌డం ఇదే తొలిసారి. సాధార‌ణంగా హీరోయిన్ షూటింగ్ కి వ‌చ్చిందంటే వెంట వాళ్ల అమ్మ‌లు కూడా ఉంటారు. కుమార్తెకు సంబంధించిన కొన్ని ప‌నుల్లో మామ్ లు క‌ల్పించుకుంటారు.

కానీ ఇలా స్పూన్ తో తినిపించ‌డం..మారాం చేయ‌డం వంటివి వెరీ రేర్. ఈ విష‌యంలో శ్రీలీల‌- అండ్ మ‌ద‌ర్ క్రేజీగా ఉన్నారు. మామ్ ఎంత దండించినా? కూతురంటే ఎంత ప్రేమ అన‌డానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. శ్రీలీల మ‌మ్మి కూడా ఈ మ‌ధ్య కాలంలో ఆమె న‌టించిన సినిమా ఈవెంట్ల‌ల‌లో త‌రుచూ క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News