గ్లామర్ లోకంలో డాక్టర్ శ్రీలీల!

తెలుగు న‌టి శ్రీలీల డ్యాన్స్‌లు, నటనతోనే కాదు. చ‌దువు ప‌ట్ల త‌నకున్న‌అంకితభావంతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.;

Update: 2026-04-16 02:45 GMT

తెలుగు న‌టి శ్రీలీల డ్యాన్స్‌లు, నటనతోనే కాదు. చ‌దువు ప‌ట్ల త‌నకున్న‌అంకితభావంతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం హీరోయిన్ల‌లో అరుదైన విషయం. న‌టిగా కొన‌సాగుతూ డాక్ట‌ర్ర లాంటి పెద్ద చ‌దువును పూర్తి చేయ‌డం అంటే ఆషామాషీ కాదు. రెండు రంగాల‌పై ఎంతో ఫ్యాష‌న్ ఉంటే త‌ప్ప సాధ్యం కాదు. మ‌రి వీటిని శ్రీలీల ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? అంటే సినిమా షూటింగులు - మెడికల్ చదువులను మేనేజ్ చేయడం ఎలా సాధ్యమని అడిగితే ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పింది.

`దీనికి అచంచలమైన సంకల్పం ఓపిక ఎంతో అవసరం. ఒక్కోసారి పరిస్థితులు క్లిష్టంగా మారతాయి. ఏమీ అర్థం కానట్టు అనిపిస్తుంది. అలాంట‌ప్పుడు స‌హ‌నంతో నిర‌ణ‌జ్ఞాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఇష్ట‌మున్నా? ఒకేసారి రెండింటిలో కొన‌సాగి ఇబ్బంది ప‌డ‌టం అవ‌స‌ర‌మా? అనిపిస్తుంది. కానీ మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటే ఏదైనా సాధించొచ్చు అంటుంది. వైద్య వృత్తిపై ఉన్న ఇష్టం, ఆ సబ్జెక్టుపై ఉన్న మక్కువ తనను ముందుకు నడిపించాయంది. పని ఒత్తిడిలో కూడా మనసును ఒక విషయం నుండి మరొక విషయానికి మార్చుకోగలగడం తన విజయ రహస్యంగా తెలిపింది.

శ్రీలీల మామ్ కు, తాతయ్యకు ఇచ్చిన మాట కోసం ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎంతో శ్రమించింది. షూటింగ్ బ్రేక్స్‌లో కారవాన్‌లో కూర్చుని చ‌దువుకునేది. సెట్స్‌లో ఉన్నప్పుడు కూడా మెడికల్ పుస్తకాలను వెంట ఉంచుకో వడం అలవాటుగా మార్చుకుంది. ముంబైలోని డి.వై. పాటిల్ యూనివర్సిటీ నుండి ఇటీవల పట్టా పొందిన సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారంటే? ఆ డిగ్రీ వెనుక ఎంతటి కష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తన తల్లి స్పెషలైజేషన్ అయిన గైనకాలజీలో ఆమె మంచి మార్కులు సాధించడం విశేషం.

శ్రీలీల తల్లి స్వర్ణలత వృత్తిరీత్యా గైనకాలజిస్ట్. తల్లిని చూస్తూ పెరగడం వల్లే తనకు కూడా వైద్య వృత్తిపై గౌరవం ఏర్పడిందని శ్రీలీల చెబుతుంది. స్టార్ హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా? తన ప్రాథమిక బాధ్యత చదువేనని ఆమె ఎప్పుడూ నమ్ముతుంది. సినిమా సెట్స్‌లో లైట్ల వెలుతురులో గడుపుతూనే, రాత్రిపూట దీపం వెలుగులో మెడికల్ టెక్స్ట్ బుక్స్‌తో కుస్తీ పట్టడం ఆమె దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఒకే సమయంలో రెండు విభిన్నమైన కష్టతరమైన రంగాల్లో రాణించడం అనేది నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి.

నటనపై ఫ్యాష‌న్ ఉన్నా? విద్యను నిర్లక్ష్యం చేయకుండా రెండు లక్ష్యాలను చేరుకోవచ్చని శ్రీలీల నిరూపించింది. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఆమె ప్రస్థానం చూస్తే అర్థమవుతుంది. గ్లామర్ రంగంలో ఉన్నవారికి చదువు అబ్బదు అనే పాతకాలపు ఆలోచనలను శ్రీలీల పటాపంచలు చేసింది. కేవలం అందం మాత్రమే కాదు. మెదడుకు కూడా పదును పెట్టాలని నిరూపించింది. రోగులకు సేవ చేస్తూనే, మరోవైపు ప్రేక్షకులను అలరించ‌నుంది.

Tags:    

Similar News