ఆ రిమార్క్ తో అవ‌కాశాలు క‌ష్ట‌మేనా?

ఈ మ‌ధ్య కాలంలో శ్రీలీల ఫేమ‌స్ అయినంత‌గా మ‌రో తెలుగు న‌టి వెలుగులోకి రాలేదు.;

Update: 2025-11-26 17:30 GMT

ఈ మ‌ధ్య కాలంలో శ్రీలీల ఫేమ‌స్ అయినంత‌గా మ‌రో తెలుగు న‌టి వెలుగులోకి రాలేదు. అంజ‌లి త‌ర్వాత ఆమెను మించిన ఫాలోయింగ్ ద‌క్కించుకున్న న‌టిగా పేరులోకి వ‌చ్చింది. మ‌హేష్‌, ర‌వితేజ , బాల‌య్య‌, నితిన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో భాగ‌మ‌వ్వ‌డంతో అమ్మడి కెరీర్ కి తిరుగుండ‌ద‌నుకున్నారు. వాటితో పాటు ఐటం భామ‌గాను సంచ‌ల‌న‌మ‌వ్వ‌డంతో? కొన్నాళ్ల పాటు వెన‌క్కి తిరిగి చూడ‌కుండా కెరీర్ సాగుతుంద‌నుకున్నారంతా. ఆ ర‌కంగా అవ‌కాశాలు కూడా అందుకుంది. కానీ తిర‌స్క‌ర‌ణ‌లో అమ్మ‌డిని ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

సెకెండ్ ఛాన్స్ అంత సుల‌భం కాదు:

అఖిల్ ఈరోగా న‌టిస్తోన్న `లెనిన్` చిత్రంలో వచ్చిన అవ‌కాశం వ‌దుల‌కున్న సంగ‌తి తెలిసిందే. హిందీ సినిమాతో డేట్లు క్లాష్ అవ్వ‌డంతో తెలుగు సినిమా ఛాన్స్ వ‌దులుకుంది. అలాగే మరో స్టార్ హీరోకి జోడీగా కూడా ఛాన్స్ వ‌చ్చింది. ఆ అవ‌కాశాన్ని కూడా అమ్మ‌డు చేతులారా వ‌దుల‌కుంది. మ‌రి ఈ ర‌క‌మైన ప‌రిస్థితుల‌తో టాలీవుడ్ లో ఛాన్సులు క‌ష్ట‌మేనా అంటే? స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. వ‌చ్చిన అవ‌కాశాలు వ‌ద్ద‌నుకుని వెళ్లిన న‌టీమ‌ణుల‌కు టాలీవుడ్ సెకెండ్ ఛాన్స్ ఇవ్వ‌దు. పూజాహెగ్డే, ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి అలాగే దూర‌మ‌య్యారు.

శ్రీలీల‌కు ఆ ప‌రిస్థితి త‌ప్ప‌దా?

కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఇద్ద‌రు తెలుగు బాలీవుడ్ కి వెళ్లారు. అటుపై మ‌ళ్లీ తెలుగులో న‌టించాల‌ని ఉంద‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా? ఎవ‌రూ ఛాన్స్ లివ్వ‌డం లేదు. శ్రీలీలకు కూడా ఆ ప‌రిస్థితి త‌ప్ప‌ద‌నే విమ‌ర్శ వ్య‌క‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం శ్రీలీల చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం `ఉస్తాబ్ భ‌గ‌త్ సింగ్`. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. శ్రీలీల న‌టిగా బిజీగా ఉన్న స‌మ‌యంలో క‌మిట్ అయిన ప్రాజెక్ట్ ఇది. కానీ ఇక‌పై కొత్త వ‌కాశాలు అంత సుల‌భం కాదు. గత రిజెక్ష‌న్ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇక‌పై మేక‌ర్స్ అప్రోచ్ అవ‌కాశం ఉంటుంది.

రిజెక్ష‌న్లు ఓ రిమార్క్ లా:

ఎంత‌టి ప్ర‌తిభావంతురాలికైనా? రిజెక్ష‌న్లు అన్న‌వి ఓ రిమార్క్ లా ప‌డ‌తాయి. సాయి ప‌ల్ల‌వి విష‌యంలో కూడా ఇదే సందేహం వ్య‌క్త‌మ‌వుతోందిప్పుడు. బాలీవుడ్ లో `రామాయణం` క‌మిట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన కొన్ని ఆఫ‌ర్ల‌ను వ‌దిలేసింది. అలాగే ఆమెని క‌థ తో మెప్పించ‌డం కూడా ఏ ద‌ర్శ‌కుడికైనా క‌త్తిమీద సాములాంటిందే అన్న వాద‌న ఉంది. వెర‌సీ ఇవ‌న్నీ సాయి ప‌ల్ల‌విని టాలీవుడ్ కి దూరం చేసేలా క‌నిపిస్తున్న‌వే. ఇలా మ‌రి ఏడాది పాటు తెలుగు సినిమాలు చేయ‌కుండా ఉంటే స్వీటీలా చ‌ప్పుడు లేకుండా ఉండాల్సిందే.

Tags:    

Similar News