భగత్‌సింగ్ తో లీలమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న శ్రీలీల క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.;
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న శ్రీలీల క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గతేడాది ఒకేసారి ఏకంగా అర డజనుకు పైగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన శ్రీలీల చేతిలో ఇప్పుడు కూడా మూడు నాలుగు సినిమాలున్నాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి.
మామూలుగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ పాటికే పూర్తై రిలీజవాల్సింది. కానీ మధ్యలో పవన్ రాజకీయాల్లో బిజీ అవడం వల్ల సినిమాలకు టైమ్ కేటాయించలేక పోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు కాస్త టైమ్ దొరకడంతో ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తి చేసుకుంటూ వస్తున్న పవన్ ఆల్రెడీ వీరమల్లు, ఓజీ షూటింగులను ఫినిష్ చేసి రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
దీంతో సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుండగా అందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల బర్త్ డే వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ శ్రీలీల బర్త్ డే ను ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్స్ లో నిర్వహించింది. శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటో ఒకటి కాస్త ఆలస్యంగా బయటికి రాగా ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
షూటింగ్ సెట్స్ లో దిగిన ఫోటో కావడంతో మెయిన్ క్యాస్టింగ్ అయిన పవన్ కళ్యాణ్, శ్రీలీల కూడా కాస్ట్యూమ్స్ లోనే ఉన్నారు. ఆ ఫోటోలో శ్రీలీల సింపుల్ లుక్స్ లో కనిపిస్తుండగా పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో ఎంతో వినయంగా కనిపించారు. ఈ ఫోటో చూసి పవన్ ఫ్యాన్స్ ఈసారి శ్రీలీల బర్త్ డే ఆమెకు చాలా మెమొరబుల్ గా మారిందని కామెంట్ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.