స్పిరిట్ లో మరో క్రేజీ హీరోయిన్..?
ప్రభాస్ స్పిరిట్ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ సందీప్ వంగ చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది.;
ప్రభాస్ స్పిరిట్ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ సందీప్ వంగ చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉంటారన్న టాక్ క్రేజీగా మారింది. తెర మీద ప్రభాస్ ఒక్కడు కనిపిస్తేనే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా అంటే ఇక ఊహించుకుంటేనే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అనిపిస్తుంది. ఐతే స్పిరిట్ సినిమాలో ఆల్రెడీ సందీప్ వంగ హీరోయిన్ ని ఫిక్స్ చేశాడు. త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా లాక్ చేశాడు.
ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం..
ఐతే ఇప్పుడు సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. స్పిరిట్ సినిమాలో మలయాళ భామ మడోనా సెబాస్టియన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రేమం సినిమాతో తెరంగేట్రం చేసిన మడోనా ఆ తర్వాత మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. తమిళ్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కూడా తమిళ్ లో ఆమె రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తుంది.
ఐతే మడోనా సెబాస్టియన్ తెలుగులో నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో లాయర్ రోల్ లో నటించింది. హీరోయిన్ గానే కాదు సినిమాలో పాత్ర కీలకం అనుకుంటే చిన్న రోల్స్ అయినా చేస్తుంది అమ్మడు. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మడోన్నా ఎంట్రీ సినిమాలో ఆమె ఎలాంటి రోల్ చేస్తుందా అన్న ఆసక్తి మొదలైంది. అందులోనూ సందీప్ వంగ ఏ రోల్ కి ఎవరు పర్ఫెక్ట్ అన్నది బాగా సెట్ చేస్తాడు.
స్పిరిట్ మీద భారీ అంచనాలు..
మడోనా తప్పకుండా మరో మంచి రోల్ తో అలరిస్తుందని చెప్పొచ్చు. యానిమల్ తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమా కాబట్టి స్పిరిట్ మీద భారీ అంచనాలు ఉంటాయి. ఐతే వాటిని అందుకోవడం కాదు స్పిరిట్ తో సరికొత్త సంచలనాలు సృష్టించేలా ఉన్నాడు సందీప్ వంగ.
స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్ వంగ ప్రభాస్ డేట్స్ ఇస్తే ఆరు నెలల్లో సినిమా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఐతే ప్రభాస్ ఫౌజీ, రాజా సాబ్ మూవీస్ కి టైం కేటాయిస్తున్నాడు. రాజా సాబ్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ అవుతుంది. స్పిరిట్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి వచ్చేలా సందీప్ ప్లానింగ్ ఉంది. ఐతే ప్రభాస్ ఇచ్చే డేట్స్ ని బట్టి రిలీజ్ అటు ఇటు ఉంటుంది. ప్రభాస్ నెక్స్ట్ 2 ఇయర్స్ లో తన సినిమాల రిలీజ్ లతో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.