'స్పిరిట్' బోల్డ్ సీన్: వంగా ప్లాన్ ఏంటీ?
ఇప్పుడు అదే డైరెక్టర్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ను కూడా 'స్పిరిట్'లో నగ్నంగా చూపించబోతున్నాడా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.;
'యానిమల్'తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తున్నాడనగానే అంచనాలు హై లెవల్‌కు వెళ్లిపోయాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే, రీసెంట్‌గా రిలీజైన 'ఆడియో టీజర్' ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. విజువల్స్ లేని ఆ టీజర్, కేవలం డైలాగ్స్‌తోనే ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం.. అందులోని ఒకే ఒక్క పవర్ ఫుల్, కాంట్రవర్షియల్ డైలాగ్.
ఆ ఆడియో టీజర్‌లో ప్రకాష్ రాజ్ వాయిస్ బాగా హైలెట్ అయ్యింది. ఆయన జైలు సూపరింటెండెంట్ పాత్రలో, ఖైదీగా ఉన్న ప్రభాస్ క్యారెక్టర్‌ను ఉద్దేశించి "వాడి బట్టలిప్పండి" అని ఆర్డర్ వేస్తాడు. ఈ ఒక్క డైలాగ్ వినగానే ఆడియెన్స్ మైండ్‌లో వెంటనే 'యానిమల్' సీన్ మెదిలింది. ఆ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌ను సందీప్ వంగా నగ్నంగా చూపించిన సీన్ ఎంత పెద్ద డిబేట్‌కు దారితీసిందో తెలిసిందే.
ఇప్పుడు అదే డైరెక్టర్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ను కూడా 'స్పిరిట్'లో నగ్నంగా చూపించబోతున్నాడా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. సందీప్ వంగా తన సినిమాల్లో ఇలాంటి బోల్డ్, షాకింగ్ ఎలిమెంట్స్‌ను కావాలనే పెడతాడని, ఆడియెన్స్‌కు షాక్ ఇవ్వడంలో ఒక కిక్ ఉంటుందని పేరుంది. అందుకే, ఈసారి ప్రభాస్‌తో కూడా ఆ ప్రయోగం చేయబోతున్నాడా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
అయితే, ఇక్కడే ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఇది నిజంగా కథకు అవసరమా లేక సందీప్ వంగా మార్క్ స్ట్రాటజీనా? అనేది పెద్ద క్వశ్చన్. కేవలం ఆడియో టీజర్‌తోనే సినిమాపై ఇంత నెగటివ్ లేదా కాంట్రవర్షియల్ బజ్ క్రియేట్ చేయడం వెనుక పక్కా మార్కెటింగ్ ప్లాన్ ఉండి ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒక్క విజువల్ చూపించకుండానే, సినిమాను దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మార్చడంలో వంగా సక్సెస్ అయ్యాడు.
నిజంగా ఆ సీన్ ఉంటే, దాన్ని ఎలా తీస్తారు? ప్రభాస్ స్వయంగా నటిస్తాడా లేక బాడీ డబుల్‌ను వాడతారా అనేది మరో సందేహం . ఇక కెమెరా యాంగిల్స్‌తో, బ్లర్ ఎఫెక్ట్స్తో మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఈ సీన్ పై మరింత క్లారిటీ రావాలి అంటే మరికొని రోజులు ఆగాల్సిందే. ఫైనల్ గా, ఈ 'న్యూడ్ సీన్' గాసిప్ మాత్రం 'స్పిరిట్' సినిమాకు కావాల్సినంత ప్రీ రిలీజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.