స్పిరిట్.. ఇది నిజమేనన్నమాట..

నటీనటులు లేకుండా టీజర్ ను విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తానికి గ్లింప్స్ తో సందీప్ వంగా హైప్ క్రియేట్ చేశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.;

Update: 2025-10-30 11:44 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ పోలీస్ డ్రామాగా తెరకెక్కనున్న ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తవ్వగా.. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ చేస్తున్నారు.

రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వాయిస్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్లింప్స్ మొదలవ్వగా.. ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఆసక్తి రేపింది. ప్రభాస్ కనిపించకపోయినా నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

నటీనటులు లేకుండా టీజర్ ను విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తానికి గ్లింప్స్ తో సందీప్ వంగా హైప్ క్రియేట్ చేశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అయితే గ్లింప్స్.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో రూపొందించారని ఆ తర్వాత వార్తలు వచ్చాయి. స్పెషల్ ఏఐ సాఫ్ట్ వేర్ తో రెడీ చేశారని ప్రచారం జరిగింది.

దానిపై అఫీషియల్ గా నిర్ధరణ లేనప్పటికీ.. చాలా మంది ఏఐతోనే చేశారని ఫిక్స్ అయ్యారు. చిన్న డైలాగ్ కు ఏఐ వాడాల్సిన అవసరం ఏముందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరు అవన్నీ రూమర్స్ అని అన్నారు. కానీ తాజాగా రిలీజ్ అయిన బాహుబలి: ది ఎపిక్ వెర్షన్ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం.. సందీప్ ఏఐ ఎందుకు వాడడం నిజంలానే ఉందని అంటున్నారు.

ఎందుకంటే.. స్పిరిట్ గ్లింప్స్ లోని వాయిస్ కు.. ఇంటర్వ్యూ లోని వాయిస్ కు చాలా తేడా కనిపిస్తుంది. ప్రభాస్ కు జలుబు చేసినట్లు తెలుస్తోంది. వాయిస్ చాలా బొంగురుగా ఉంది. దీంతో సందీప్.. ఏఐ వాడినట్లు క్లారిటీగా తెలుస్తుందని అంటున్నారు. మరికొందరేమో కొన్ని రోజుల క్రితం రికార్డు చేసి ఉండొచ్చని.. అప్పటికి ఇప్పటికి వాయిస్ లో తేడా వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

ఏదేమైనా ఇప్పుడు ప్రభాస్ వాయిస్ పై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకరు స్పిరిట్ గ్లింప్స్ ఏఐతో చేశారంటే.. మరొకరు కాదని అంటున్నారు. ఒకరు ఎప్పుడో రికార్డ్ చేశారంటే.. మరొకరు కాదని వాదిస్తున్నారు. మొత్తానికి ఏం జరిగిందనేది.. సందీప్ రెడ్డి వంగాకు తెలియాలి. గ్లింప్స్ విషయంపై ఫ్యూచర్ లో ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News