• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పార్క్ L.I.F.E...

స్పార్క్ L.I.F.E ట్రైలర్.. ఎలా ఉందంటే..

| రెండు సిటీస్ నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్స్ తో లవ్ స్టొరీ నడిపిన హీరో వారిని తమ ప్రేమలో దింపడంతో ట్రైలర్ లో కథని స్టార్ట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2023-10-14 10:47 GMT

విక్రాంత్ హీరోగా డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ స్పార్క్ L.I.F.E. లవ్ అండ్ సస్పెన్స్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విక్రాంత్ కి జోడీగా మెహరీన్, రుక్సర్ ధిల్లాన్ నటిస్తున్నారు. రెండు సిటీస్ నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్స్ తో లవ్ స్టొరీ నడిపిన హీరో వారిని తమ ప్రేమలో దింపడంతో ట్రైలర్ లో కథని స్టార్ట్ చేశారు.


తరువాత సిటీలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటిని హీరో విక్రాంత్ చేస్తున్నట్లుగా రిప్రజెంట్ చేసి, అతనిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారు. సీరియల్ కిల్లర్ గా హీరోని చూపించారు. అసలు ఆడవాళ్ళని హీరో ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు. హీరో అనుకున్న వాడే విలన్ అని పోలీసులు ఎందుకు ముద్ర వేశారు.

అసలు ఈ హత్యల వెనుక ఎవరున్నారు అనేది ట్రైలర్ లో ఇంటరెస్టింగ్ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నాన్నమ్మ కలలు నిజం అవుతాయా అంటూ హీరోయిన్ మెహరిన్ బామ్మని అడిగే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేశారు. కాలేజీ లవ్ స్టొరీని ఓ వైపు ఆవిష్కరించి, మరో వైపు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో మెహరిన్ తో ప్రేమని నడిపించే ఎపిసోడ్స్ ని ఆవిష్కరించారు.

సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సీక్వెన్స్ కూడా పెర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేశారు. నాజర్, సుహాసిని లాంటి సీనియర్ స్టార్ క్యాస్టింగ్ కూడా సినిమాలో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. షియాజీ షిండే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. మూవీలో మెయిన్ విలన్ గా మలయాళీ నటుడు గురు సోమసుందర్ నటించడం విశేషం. ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ లవ్ స్టొరీని నడిపించి ఆపై సీరియల్ క్రైమ్స్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథని నడిపించారు.

అలాగే పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా చూపించారు. ఓవరాల్ గా చూసుకుంటే ట్రైలర్ మాత్రం చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా ఉంది. ఖుషి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హేసమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం. బడ్జెట్ కూడా ట్రైలర్ లో కనిపిస్తోంది. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నవంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ మూవీ ఏ మేరకు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

Full View
Tags:    
  • Vikranth 
  • Mehreenpirzada 
  • Rukshardhillon 
  • Spark 
  • Sparklife 
  • Sparkmovie 
  • Trailerreleased 
  • Trailer 
  • Gurusomasundaram 
  • Deaffrogproductions 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS