ఐటం సాంగ్ అంటే జుర్రుడే!
హీరోయిన్ గా సంపాదించే పారితోషికం ఒక్క ఐటం పాటతోనే సంపాదిస్తున్నారు. ఐదారేళ్లగా ఇదే విధానం అమలులో ఉంది.;
ఒకప్పుడు ఐటం సాంగ్స్ అంటే ప్రత్యేకమైన భామలుండేవారు. అవసరం మేర పర భాషల నుంచి దిగుమతి చేసుకునేవారు. కానీ నేడు ట్రెండ్ మారిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్లే ఐటం భామలుగా మారి పోతున్నారు. హీరోయిన్ ఇమేజ్ ను పక్కన బెట్టి నర్తకిగా సునాయాసంగా మారిపోతున్నారు. హీరోయిన్ గా సంపాదించే పారితోషికం ఒక్క ఐటం పాటతోనే సంపాదిస్తున్నారు. ఐదారేళ్లగా ఇదే విధానం అమలులో ఉంది.
అయితే పారితోషికం విషయంలో ఇప్పుడు పీక్స్ కి చేరిందన్నది తాజా సంగతి. ఐటం పాటలకి మునుపటి కంటే రెండింతలు అధికంగా డిమాండ్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో మార్మోగుతోంది. సినిమాకు కోటి తీసుకునే భామ రెండు కోట్లు...రెండు కోట్లు తీసుకునే వాళ్లు నాలుగు కోట్లు...నాలుగైదు కోట్లు తీసుకునే వాళ్లు ఏకంగా పది కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ లో ఉన్న డిమాండ్ ని బట్టి సదరు భామలు ఈ రకమైన డిమాండ్ కు దిగ్గుతున్నట్లు వినిపిస్తుంది.
కాజల్, తమన్నా లాంటి భామలు ఇప్పటికే ఐటం భామలుగా ఎంట్రీ ఇచ్చేసారు. హీరోయిన్లగా వెలుగు వెలిగిన భామలిద్దరు సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి ఛాన్సులొచ్చినా వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో కాజల్ కంటే తమన్నా మరింత మెరుగ్గా ఉంది. ఐటం భామగా బాగా ఫోకస్ అయింది. ఇటీవల ఓ తెలుగు సినిమాలో ఐటం పాటకు తమన్నాను సంప్రదించగా నాలుగు కోట్లు అడిగిందట.
దీంతో అంత బడ్జెట్ తమన్నా కి ఇవ్వడం కంటే కొత్త భామనే పెట్టుకుందని ఓ యువ నాయికని ఎంపిక చేసినట్లు తెలిసింది. శ్రుతి హాసన్ కూడా ఐటం పాటల పారితోషికం విషయంలో భారీగానే డిమాండ్ చేస్తోందట. అమ్మడి డిమాండ్ ఐదు కోట్లకు పైగానే ఉందని సమాచారం. హీరోయిన్ గా అయితే శ్రుతి హాసన్ కు అంత డిమాండ్ లేనే లేదు.