ఆ ఇద్ద‌రి ప్రేమ క‌థ ఎలా ఉండ‌బోతుంది?

యువ హీరో రోష‌న్ మేక క‌థానాయ‌కుడిగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-02-15 22:30 GMT

యువ హీరో రోష‌న్ మేక క‌థానాయ‌కుడిగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది ప్రేమ క‌థ కావ‌డ‌మే సంచ‌ల‌నంగా మారింది. ల‌వ్ స్టోరీకు రోష‌న్ ప‌క్కాగా యాప్ట్ అయ్యే న‌టుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఛార్మింగ్ బోయ్ ఎలాంటి ప్రేమ కథ‌కైనా సెట్ అవుతాడు. ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌లోనూ ఒదిగిపోతాడు. కానీ ఇంత‌వ‌ర‌కూ సీన్సియ‌ర్ అటెంప్ట్ మాత్రం చేయ‌లేదు. ప్యూర్ ల‌వ్ స్టోరిని ఇంత వ‌ర‌కూ రోష‌న్ కూడా ట‌చ్ చేయ‌లేదు. దీంతో ఆ పాత్ర‌, స్టోరీ ఎలా క‌నిపిస్తాడు? అన్నది ఆస‌క్తిక‌ర‌మే.

అయితే అంత‌కు మించిన ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే? శైలేష్ కొల‌ను ల‌వ్ స్టోరీని ఎత్తుకోవ‌డ‌మే. అవును ఇప్ప‌టి వ‌ర‌కూ శైలేష్ సినిమాల‌న్నీ క్రైమ్ థ్రిల్ల‌ర్లే. హిట్ మూడు భాగాలు యాక్ష‌న్ , క్రైమ్ స్టోరీలే. `సైంధ‌వ్` కూడా అదే జాన‌ర్లో ఉంటుంది. ఆ ర‌కంగా శైలేష్ కొల‌ను క్రైమ్ థ్రిల్లర్ల‌కు స్పెష‌లిస్ట్ లా మారిపోయాడు. అత‌డి సినిమాలు తీసిన తీరు చూస్తే శైలేష్ నిరంత‌రం క్రైమ్ ఆలోచ‌న‌ల‌తోనే గ‌డుపుతాడా? అన్న సందేహం రాక మాన‌దు. ఆ క్రైమ్ క్థ‌ల్ని ఇన్నో వేటివ్ గా చూపించే ప్ర‌య్న‌తం చేస్తాడు. వాటి కోసం ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేస్తాడు.

ర‌క‌ర‌కాల క్రైమ్ పుస్త‌కాలు చ‌ద‌వుతాడు. అంత‌ర్జాతీయంగా న‌మోద‌వుతోన్న క్రైమ్ ని చాలా ద‌గ్గ‌ర‌గా స్ట‌డీ చేస్తుంటాడు. సాధార‌ణంగా ప్ర‌తీ ద‌ర్శ‌కుడికి ఓ స్పెష‌ల్ జోన‌ర్ అంటూ ఉంటుంది. ఆ జోన‌ర్ల‌నే క‌థ‌లు రాస్తుంటారు. శైలేష్ కూడా అంతే. కానీ రోష‌న్ తో మాత్రం ల‌వ్ స్టోరీ తీస్తాన‌న‌డ‌మే సంచ‌ల‌నంగా మారింది. అది ఎలాంటి ల‌వ్ స్టోరీ అవుతంది? అన్న దానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. రెగ్య‌లర్ ల‌వ్ స్టోరీలైతే చేయ‌డు. ప్రేమ క‌థైనా అందులో కొత్త‌ద‌నం చూస్తాడు. ఆ అంద‌మైన ల‌వ్ స్టోరీ చుట్టూ త‌న‌దైన మార్క్ ఓ క్రైమ్ క‌థ‌ని అల్లుతాడా? లేక ప్యూర్ ల‌వ్ స్టోరీని అలాగే చూపిస్తాడా? అన్న దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో మ‌రో అంశం కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఇదొక క్యూట్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ అని, షూటింగ్ ఎక్కువ భాగం ఆమెరికాలో ఉంటుందంటున్నారు. విదేశాల్లో స్థిర‌ప‌డిన తెలుగు యువ‌తీ, యువ‌కుడి మ‌ధ్య సాగే ప్రేమ క‌థ‌గా వినిపిస్తోంది. అయితే శైలేష్ ఇలాంటి క‌థ‌ను ఎత్తుకోవ‌డం ఓ వ‌ర్గంలో కాస్త ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తోంది.క్రైమ్ ఆలోచ‌న‌ల‌తో నిండిపోయిన ఆ పుర్రెలో ప్రేమ క‌థ‌లు పుడ‌తాయా? పుట్టినా అద్భుతంగా ఉంటుందా? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా అడుగుతున్నారు. దీనికి స‌మాధానం శైలేష్ నోటితే చెబితే స‌రిపోదు. రిలీజ్ త‌ర్వాత సినిమా మాత్ర‌మే మాట్లాడాలి.

Tags:    

Similar News