హీరోగా స‌క్సెస్ అయితే అలా సెటిలైపోతాడా?

అయితే ద‌ర్శ‌క‌త్వం అంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. అక్క‌డ నాలిగింత‌లు ప‌ని చేయాలి . కానీ న‌టుడిగా అంత క‌ష్టం ఉండ‌దు.;

Update: 2026-02-15 23:30 GMT

డైరెక్ట‌ర్ల‌గా ఎంట్రీ ఇచ్చి న‌టులుగా స్థిర‌ప‌డిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎస్. జె సూర్య‌, గౌత‌మ్ మీన‌న్, స‌ముద్ర‌ఖ‌ని, ర‌విబాబు, దేవి ప్ర‌సాద్ ఇలా కొంత మంది ఉన్నారు. తాజాగా వారి జాబితాలో తరుణ్ భాస్క‌ర్ కూడా చేరిపోయేలా ఉన్నాడు. 'పెళ్లి చూపులు' తో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన త‌రుణ్ ఇప్పుడు న‌టుడిగా బిజీగా ఉన్నాడు. అలాగే ప్ర‌దీప్ రంగ‌నాధ్ కూడా డైరెక్ట‌ర్ గానే ఎంట్రీ ఇచ్చాడు. కట్ చేస్తే పెద్ద హీరో గా ఎదుగుతున్నాడు. అలాగ‌ని కెప్టెన్ కుర్చీకి దూరం కాలేదు. స‌మ‌యం ..సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డా స‌త్తా చాటేలా సిద్దంగా ఉంటున్నారు.

అయితే ద‌ర్శ‌క‌త్వం అంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. అక్క‌డ నాలిగింత‌లు ప‌ని చేయాలి . కానీ న‌టుడిగా అంత క‌ష్టం ఉండ‌దు. పారి తోషికం ద‌ర్శ‌కుడిని మించి అందుకుంటున్నారు. ఒకేసారి మూడు , నాలుగు సినిమాలైనా చేసుకునే వెసులు బాటు ఉంటుంది. అందుకే ద‌ర్శ‌క‌త్వం కంటే న‌ట‌న‌కే వీరంతా ప్రాధాన్య‌త ఇస్తున్నారు. తాజాగా కోలీవుడ్ ద‌ర్శ‌క సంచల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా న‌టుడిగా సెటిల్ అవ్వ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. `ఖైదీ`, `విక్ర‌మ్`, `లియో`, `కూలీ` లాంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా పాన్ ఇండియాలో సంచ‌ల‌నం అయిన లోకేష్ `డీసీ` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు అంచ‌నాల‌ను మంచి రీచ్ అయ్యాడు. చూస్తుంటే విజ‌యం అందుకునేలా ఉన్నాడు. గ‌తంలో ద‌ర్శ‌కుడిగా కూడా ఎక్కువ కాలం ప‌ని చేయ‌ను అన్నాడు లోకేష్‌. ఓ ప‌ది సినిమాలు చేసి రిటైర్మెంట్ తీసుకుంటాన‌న్నాడు. అంతే కాదు ద‌ర్శ‌కుడిగా ప‌ని చేయ‌డం అంత సుల‌భం కాద‌న్నాడు. రైటింగ్ తో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం చిన్న విష‌యం కాద‌ని..ఎంతో మైండ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంద‌న్నాడు. రైటింగ్ అన్న‌ది చాలా ట‌ఫ్ జాబ్ గా పేర్కొన్నాడు. ఇవ‌న్నీ చూస్తుంటే లోకేష్ కోలీవుడ్ లో న‌టుడిగా స్థిర ప‌డిపోతాడా? అన్న సందేహం రాక మాన‌దు.

న‌టుడిగా స‌క్సెస్ అయితే ద‌ర్శ‌కుడిని మించిన పారితోషికం అందుకుంటాడు. ఒకేసారి నాలుగైదు సినిమాల‌కు అడ్వాన్సులు అందుకునే అవ‌కాశం ఉంటుంది. ఒకేసారి వాటిని పూర్తిచేసేది అత‌డి చేతుల్లో ప‌నే. అదే ద‌ర్శ‌కుడిగా అయితే అంత పారితోషికం కూడా రాదు. నెల‌ల త‌ర‌బ‌డి ఒకే సినిమాపై ప‌ని చేయాల్సి ఉంటుంది. రిలీజ్ అయిన త‌ర్వాత ప్లాప్ అయితే మ‌రో అవ‌కాశం క‌ష్టం. కానీ హీరోగా మార్కెట్ బిల్డ్ చేసుకుంటే రెండు..మూడు సినిమాలు పోయినా? మ‌రో ఛాన్స్ రెడీ గా ఉంటుంది.

Tags:    

Similar News