జ్యోతిష్యుడుగా నరేష్.. ఆ మాటలు వెనుక అర్థం

సీనియర్ నటుడు నరేష్ అంటే తెలియనివారు వుండరు. ఇక ఇప్పుడు ఆయన ఫుల్ జోష్‌లో ఉన్నారు.;

Update: 2026-02-15 18:30 GMT

సీనియర్ నటుడు నరేష్ అంటే తెలియనివారు వుండరు. ఇక ఇప్పుడు ఆయన ఫుల్ జోష్‌లో ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా, భవిష్యత్తును ముందే ఊహించే 'సక్సెస్ జ్యోతిష్యుడి గా కూడా మారిపోయారు. పవిత్ర లోకేష్ తన జీవితంలోకి వచ్చాక తన విశ్లేషణలు, అంచనాలు అన్నీ నిజమవుతున్నాయని ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా తన కొత్త సినిమా 'హే భగవాన్' విజయంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

నేను చెప్పానంటే హిట్టే.. 'హే భగవాన్'పై నరేష్ ధీమా:

నరేష్ ఈ మధ్య కాలంలో ఏ సినిమా హిట్ అని చెబితే అది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సామజవరగమన నుంచి మొదలైన ఈ మ్యాజిక్, మొన్నటి సంక్రాంతి విన్నర్ 'నారీ నారీ నడుమ మురారి' వరకు కొనసాగింది. ఇప్పుడు తాజాగా 'హే భగవాన్' సినిమాపై కూడా ఆయన అంతే నమ్మకంగా ఉన్నారు. "నేను ఆషామాషీగా ఏదీ చెప్పను, నా విశ్లేషణ పక్కాగా ఉంటుంది. ప్రమోషన్ల కోసం ఈ మాటలు అనడం లేదు, సినిమా చూశాక నా మాటతో మీరందరూ ఏకీభవిస్తారు" అని పవిత్రతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ కుండబద్దలు కొట్టారు. రాజకీయాలో అయినా, సినిమాల్లో అయినా తన అంచనా తప్పదని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

నా కెరీర్‌లోనే బెస్ట్ క్లైమాక్స్.. కొత్త తరహా వినోదం:

వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న 'హే భగవాన్' చిత్రం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నరేష్ వెల్లడించారు. సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన ఈ సినిమాలో తన పాత్రను దర్శకుడు గోపీ అచ్చర అద్భుతంగా తీర్చిదిద్దారని, ప్రేక్షకులు తన నటనను చూసి ఆశ్చర్యపోతారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోనే అత్యుత్తమమైనదిగా అభివర్ణించారు. కొత్త కథకు వినోదాన్ని జోడించి తీసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా కచ్చితంగా మెప్పిస్తుందని, ఫిలిం క్రిటిక్స్ సైతం శభాష్ అనేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నరేష్ జోస్యం నిజమవుతుందా:

సాధారణంగా నరేష్ ఏదైనా విషయంలో ఇంత నమ్మకంగా ఉన్నారంటే అందులో ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది అంటున్నారు అయన అభిమానులు. ఇక పవిత్ర ఆయన జీవితం లోకి వచ్చాక వరుస విజయాలు ఆయనను పలకరిస్తున్నాయి అంటే నిజం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక సామజవరగమన లాంటి సర్ప్రైజ్ హిట్లను ముందే ఊహించిన నరేష్, 'హే భగవాన్' విషయంలో కూడా అంతే కాన్ఫిడెంట్‌గా ఉండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. మరి సుహాస్ హీరోగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నరేష్ చెప్పినట్లే మ్యాజిక్ చేసి, ఆయన హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుందో లేదో తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే..

Tags:    

Similar News