ఆ ముగ్గురు ముద్దు గుమ్మ‌లు సంథిగ్ స్పెష‌ల్!

సౌత్ బ్యూటీలు త్రిష‌, న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ ల జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కీర్తి కంటే త్రిష‌, న‌య‌న్ లు సీనియ‌ర్లు. వీళ్లిద్ద‌రు దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. త్రిష టాలీవుడ్...కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా చాలా కాలం కొన‌సాగింది.;

Update: 2025-06-21 23:30 GMT

సౌత్ బ్యూటీలు త్రిష‌, న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ ల జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కీర్తి కంటే త్రిష‌, న‌య‌న్ లు సీనియ‌ర్లు. వీళ్లిద్ద‌రు దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. త్రిష టాలీవుడ్...కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా చాలా కాలం కొన‌సాగింది. ఇప్ప‌టికీ సినిమాలు చేస్తోంది. అయితే మునుప‌టి అంత బిజీగా లేదు. సెల‌క్టివ్ గా వెళ్తోంది. స్టార్ హీరోల చిత్రాలు మాత్ర‌మే చేస్తోంది. టైర్ 2 హీరోల‌తో కూడా సినిమాల‌కు క‌మిట్ అవ్వ‌డం లేదు.

లేడీ సూప‌ర్ స్టార్ గా నీరాజ‌నాలు అందుకుంటోన్న న‌య‌న‌తార కూడా త్రిష త‌ర‌హాలోనే సినిమాలు చేస్తోంది. సీనియ‌ర్ హీరోలు...పేరున్న స్టార్లు అయితేనే క‌మిట్ అవుతుంది. భారీగానూ పారితోషికం అందుకుంటుంది. ఇవ‌న్నీ కుదిరితేనే కొత్త సినిమాల‌కు క‌మిట్ అవుతుంది. ఇక కీర్తి సురేష్ మాత్రం వీళ్లిద్ద‌రికి భిన్నం. ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా..ఎలాంటి పాత్ర వ‌చ్చినా సై అంటోంది.

పారితోషికం విష‌యంలోనూ పెద్ద‌గా డిమాండ్లు లేవు. నిర్మాత‌ల సౌక‌ర్యాన్ని దృష్టిలో పెట్టుకునే కోట్ చేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు, హిందీ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఓ కామ‌న్ పాయింట్ క‌నిపిస్తుంది. ఈ ముగ్గురు భామ‌లు బాలీవుడ్ లో వ‌స్తోన్న కొత్త ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అవ్వ‌డం లేదు. త్రిష ప‌దేళ్ల క్రితం క‌ట్టా మిట్టాతో బాలీవుడ్లో లాంచ్ అయింది. ఆసినిమా పెద్ద‌గా ఆడ‌లేదు.దీంతో అప్ప‌ట్లో అవ‌కాశాలు కూడా రాలేదు.

అయితే ఈ మ‌ధ్య కాలంలో హిందీ అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని సున్నితంగా తిర‌స్క‌రిస్తోందిట‌. అలాగే `జ‌వాన్` సినిమాతో న‌య‌న‌తార కూడా బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిదే. ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో హిందీలో చాలా ఛాన్సులొచ్చాయి. కోట్ల రూపాయ‌లు గుమ్మరిస్తామ‌న్నా న‌య‌న్ నో చెప్పింది. అలాగే కీర్తి సురేష్ కూడా `బేబి జాన్` త‌ర్వాత కొన్ని హిందీ సినిమాల‌కు నో చెప్పిందిట‌. దీంతో సౌత్ ప్రాజెక్ట్ లకు ఇచ్చిన ప్రాధాన్యత హిందీ చిత్రాల‌కు ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News