ఆ న‌లుగురు భామ‌లు పెళ్లి మాట ఎత్త‌డం లేదే!

స్వీటీ అనుష్క‌.. త్రిష‌.. స‌మంత..శ్రుతిహాస‌న్ లు ఒకే మార్గంలో క‌నిపిస్తున్నారు. త్రిష కు గతంలో వ‌రుణ్ మ‌నియ‌న్ అనే వ్యాపార వేత్త‌తో నిశ్చితార్దం అయి క్యాన్సిల్ అయింది.;

Update: 2025-04-20 04:00 GMT

బాలీవుడ్ సీనియ‌ర్ భామ‌లంతా పెళ్లి చేసుకుని త‌ల్లులై ఎలా రాణిస్తున్నారో క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. క‌రీనా క‌పూర్, దీపికా ప‌దుకొణే, క‌త్రినా కైఫ్, అలియాభట్ ల ప్ర‌యాణం ఎలా సాగుతుందో తెలిసిందే. ఓవైపు న‌టీమ‌ణులుగా బిజీగా ఉంటూనే ఇల్లాలిగా మారి ఇంటి బాధ్య‌త‌లు చ‌క్క‌బెడు తున్నారు. పెళ్లైతే అదృష్టం క‌లిసొస్తుంద‌ని మ‌రికొంత మంది భామ‌లు ప్రేమ వివాహాలు చేసుకుని స్థిర‌ప‌డుతున్నారు. ప్రోపెష‌న‌ల్ గానూ కొన‌సాగుతున్నారు. కానీ సౌత్ ఈ సీనియ‌ర్ భామ‌లు మాత్రం పెళ్లి మాట ఎత్త‌డం లేదు.

కెరీర్ ప‌రంగా ఢోకా లేకుండా ప్ర‌యాణం సాగుతున్నా? 40 దాటినా ఇంకా నో మ్యారీడ్ అన‌డం ఆశ్చ‌ర్య క‌రం. స్వీటీ అనుష్క‌.. త్రిష‌.. స‌మంత..శ్రుతిహాస‌న్ లు ఒకే మార్గంలో క‌నిపిస్తున్నారు. త్రిష కు గతంలో వ‌రుణ్ మ‌నియ‌న్ అనే వ్యాపార వేత్త‌తో నిశ్చితార్దం అయి క్యాన్సిల్ అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి మాట ఎత్త‌లేదు. ఎవ‌రి తోనూ రిలేష‌న్ షిప్ లోనూ కొన‌సాగ‌లేదు. మ‌రి పెళ్లి చేసుకోరా? అంటే కాద‌ని చెప్ప‌డం లేదు. న‌చ్చిన వాడు దొర‌కాలి క‌దా? అంటూ స్కిప్ కొడుతుంది.

అలాగే అనుష్క ఎవ‌రితోనూ ల‌వ్ లోనూ ప‌డ‌లేదు. ఏ హీరోతోనూ రిలేష‌న్ షిప్ లోనూ లేదు. ఆ మ‌ధ్య ఇంట్లో త‌ల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ అవి అక్క‌డికే ప‌రిమితం అయ్యాయి. వాటిపై మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. వాళ్ల క‌న్నా కాస్త జూనియ‌ర్ అయిన శ్రుతి హాస‌న్ కూడా పెళ్లిని ఏమాత్రం సీరియ‌స్ గా తీసుకోలేదు. ఇప్ప టికే ఇద్ద‌రిలో రిలేష‌న్ షిప్ నడిపించింది. మైఖెల్ కోర్స‌లే త‌ర్వాత శంత‌ను హ‌జారికాతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది.

ఆ బంధాన్ని అక్క‌డి వ‌ర‌కే ప‌రిమితం చేసింది. అటుపై నో రిలేషన్ షిప్స్ అండ్ మ్యారేజ్ అంటూ వెళ్తోంది. నాగ చైత‌న్య‌తో విడాకులు త‌ర్వాత స‌మంత కూడా సింగిల్ గానే ఉంటుంది. పెళ్లి గురించి ఆలోచ‌న చేస్తున్న‌ట్లే క‌నిపించ‌లేదు. ఇంకా మ‌రికొంత మంది సౌత్ భామ‌లు ఇదే తీరున ఉన్నారు. ముంబై బ్యూటీ అయిన త‌మ‌న్నా కూడా ఇటీవ‌లే విజ‌య్ వ‌ర్మ‌తో విడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ జ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట ప‌డుతుంది.

Tags:    

Similar News