ఆమెకు మాత్రం టాలీవుడ్ లో నో ఛాన్సా!
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలో ఇక్కడ అవకాశాలు కాదని బాలీవుడ్ కి వెళ్లిందో బ్యూటీ.;
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలో ఇక్కడ అవకాశాలు కాదని బాలీవుడ్ కి వెళ్లిందో బ్యూటీ. రెండు..మూడు సినిమాలు చేసింది. అవేవి కలిసి రాలేదు. దీంతో ఓటమిని ముందే గ్రహించిన అమ్మడు మళ్లీ సౌత్ ఇండస్ట్రీకి కంబ్యాక్ అయింది. ఆ సమయంలో టాలీవుడ్ అవకాశాలు ఇవ్వలేదు గానీ, కోలీవుడ్ మాత్రం అక్కున చేర్చుకుంది. అమ్మడు ఊహించిన దానికంటే గ్రాండ్ కంబ్యాక్ దక్కింది. వరుసగా అవకాశాలు ఒడిసి పట్టుకుంటుంది. అలా కోలీవుడ్ కి అమ్మడు అలవాటు గామారింది.
సక్సెస్ తో సంబంధం లేకుండా కొత్త అవకాశాలు అందుకుంటుంది. ఇదే క్రమంలో మళ్లీ టాలీవుడ్ లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. వాస్తవానికి వచ్చిన కొత్తలోనే మేనేజర్ ని రంగంలోకి దించింది. కానీ పప్పులుడకలేదు. మేనేజర్ ద్వారా రాయబారం చూద్దాం అని తిప్పిపంపించేవారు. అలా ఓ రెండు సార్లు జరిగింది. దీంతో విషయాన్ని గ్రహించిన నయా బ్యూటీ కొన్ని రోజులు కామ్ అయింది. ఎలాంటి ప్రయ త్నాలు చేయకుండా దొరికిన అవకాశాలతోనే తృప్తి పడింది. తాజాగా తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాకు ఐటం పాట లో నర్తకి అవకాశం కోసం అమ్మడి పేరు పరిశీలించారుట.
ఓ ముగ్గురు భామలతో పాటు ఈ నటి ఏరు కూడా పరిశీలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మిగతా ముగ్గురుతో తో పోలిక చేస్తే ఈ నటి అయితే బాగుంటుందని మేకర్స్ కూడా భావించారుట. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆ నటిని తీసుకుంటే ఎదురయ్యే ఇబ్బందులు గురించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అడ్డు పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ బ్యానర్లో ఆ నటితో సినిమా చేసిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తు చేసి మరో నటిని ప్రత్నామ్నాయంగా చూసుకోమని సలహా ఇచ్చారుట.
తానే కావాలని పట్టుబడితే మాత్రం ఛాయిస్ ఈజ్ యువర్స్ అనేసారుట. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఇండస్ట్రీలో ట్యాలెంట్ కంటే ముందు చూసేది క్రమశిక్షణ. తెర వెనుక ఎలా ఉన్నా? తెర ముందుకొచ్చే సరికి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని భావిస్తారు. అలా అవ కాశాలు అందుకుని కెరీర్ ని ఇప్పటికీ నెట్టుకొస్తున్నవారెంతో మంది. ఆనటితో తేడా కొట్టిన తర్వాత తెలు గులో ఇంకెవరూ అవకాశాలు కల్పించలేదు. అదీ సంగతి.