సర్దార్ పై శ్రద్ధ లేదు ఎందుకు..?
బాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒకటి అర మాత్రమే ప్రేక్షకులను అలరిస్తున్నాయి.;
బాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒకటి అర మాత్రమే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు అక్కడ గడ్డుకాలం నడుస్తుంది. బాలీవుడ్ లో ఒకప్పుడు సంచలన విజయాలు అందుకున్న వారైనా సరే తమ సినిమాలతో దారుణమైన ఫలితాలు అందుకుంటున్నారు. దీని వెనుక రీజన్స్ ఏంటంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకులు సమీక్ష చేస్తున్నా వాళ్లకి కూడా అంతుచిక్కని ప్రశ్నగా ఇది ఉంది.
ఐతే ఈ క్రమంలో స్టార్ సినిమాల రిలీజ్ డేట్ పై కూడా అటు ఇటుగా ఉన్నారు. లేటెస్ట్ గా అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్ధార్ 2 ని అసలైతే జూలై 25న అంటే నేడు రిలీజ్ చేయాలని అనుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా జూలై 25న రిలీజ్ అనే ప్రమోట్ చేశారు. కానీ రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న సైయారా ముందు అజయ్ దేవగన్ సినిమా నిలబడలేదని సినిమా రిలీజ్ వాయిదా వేశారు.
సన్ ఆఫ్ సర్ధార్ 2 సినిమా జూలై 25న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా.. దాన్ని ఆగష్టు 1కి వాయిదా వేశారు. ఈ వాయిదా వెనుక రీజన్ సైయారా మూవీ కలెక్షన్స్ తో దూసుకెళ్ల్లడమే అని అంటున్నారు. సైయారా కాస్త దూకుడు తగ్గాక రిలీజైతే సినిమాకు ప్లస్ అని భావిస్తున్నారు. అజయ్ దేవగన్ ఒక యువ నటీనటులు చేసిన సినిమాతో పోటీ పడకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అది కూడా ఆల్రెడీ ఆ సినిమా రిలీజై వారం తర్వాత కూడా అజయ్ సన్ ఆఫ్ సర్దార్ 2 వస్తుంది.
తెలుగులో రాజమౌళి డైరెక్టర్ చేసిన మర్యాద రామన్న సినిమానే హిందీలో సన్ ఆఫ్ సర్దార్ సినిమా రీమేక్ చేశారు. ఐతే మాత్రుక సినిమా సీక్వెల్ చేయలేదు కానీ అజయ్ దేవగన్ ఆ ప్రయత్నం చేశారు. సినిమా ట్రైలర్ ఈమధ్యనే రిలీజై ఓకే అనేలా ఉంది. మరి సూపర్ హిట్ తెలుగు సినిమాకు సీక్వెల్ హిందీలో రావడం విశేషంగానే ఉన్నా ఆ సినిమాపై ఆశించిన స్థాయి బజ్ లేకపోవడం కష్టమే అని చెప్పొచ్చు. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాతో అజయ్ దేవగన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా రిలీజ్ అవుతున్న రోజే దడక్ 2 కూడా వస్తుంది. ఆ సినిమా కూడా సర్దార్ కి ఒక త్రెట్ గా మారుతుందని అంటున్నారు. మరి సర్దార్ ఏం చేస్తాడన్నది మరో వారంలో తెలుస్తుంది.