చిన్నారి ప్రాణం కాపాడ‌టానికి 17కోట్లు సేక‌రించిన న‌టుడు!

క‌రోనా క్రైసిస్ క‌ష్ట కాలంలో ప్ర‌జ‌ల‌ను దేవుడిలా ఆదుకున్నాడు న‌టుడు సోనూసూద్. అత‌డి సేవ‌ల‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురిసాయి

Update: 2024-05-16 18:28 GMT

క‌రోనా క్రైసిస్ క‌ష్ట కాలంలో ప్ర‌జ‌ల‌ను దేవుడిలా ఆదుకున్నాడు న‌టుడు సోనూసూద్. అత‌డి సేవ‌ల‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురిసాయి. అత‌డిని గొప్ప మాన‌వ‌తావాదిగా, పిలిస్తే ప‌లికే దేవుడిగా కొలిచారు ఆప‌న్నులు. చాలా మంది పేద‌లు ఇప్ప‌టికీ సోనూసూద్ ని దేవుడు అనే అంటున్నారు. నటుడు, మానవతావాది సోనూ సూద్ మళ్లీ దేవ‌దూతగా ఉద్భవించాడు. ఈసారి ఒక శిశువు కోసం అత‌డు ముందుకొచ్చాడు. జైపూర్‌లో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్ 2తో పోరాడుతున్న 22 నెలల పసికందు ప్రాణాన్ని కాపాడ‌గ‌లిగే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కోసం సోనూసూద్ రూ. 17 కోట్లు సేకరించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అత‌డి ప్రచారం సమాజంలోని అన్ని రంగాల నుండి విస్తృత మద్దతును పొందింది. కేవ‌లం మూడు నెలల్లో 9 కోట్ల నిధిని స‌మ‌కూర్చ‌గ‌లిగాడు.

ప‌లుమార్లు అత‌డి ప్రచారం చాలా తక్కువ వ్యవధిలో విజయవంతంగా అవసరమైన మొత్తాన్ని సేకరించి జీవితాల‌ను కాపాడుతోంది. సోను సూద్ తాజా స‌హాయం అచంచలమైన అత‌డి నిబద్ధతను మరోసారి నొక్కిచెప్పింది. అతడిని జాతీయ హీరోగా ఎందుకు ప్రశంసిస్తున్నారో మ‌రోసారి అర్థ‌మైంది.

ఇంతకుముందు ఆస్ప‌త్రి సేవ‌ల‌కు డ‌బ్బు లేక‌ పేద‌లు బ‌లి కాకూడ‌ద‌ని మద్దతు ఇచ్చిన సోను సూద్ ఇప్పటివరకు దాదాపు 9 మంది ప్రాణాలను కాపాడాడు. మంచి కోసం ఇలాంటి ప్రచారానికి అవిశ్రాంతంగా తనను తాను అంకితమిచ్చాడు అత‌డు. సోనూ సూద్ అవిశ్రాంత ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా ప్రజల నుండి వచ్చిన అపారమైన మద్దతును ఒక వ‌ర్గం త‌ట్టుకోలేకుండా ఉంద‌న్న‌ది వాస్త‌వం. గ‌తంలో అత‌డిపై ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగింది.

Read more!

న‌టుడిగా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... సోను సూద్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `ఫతేహ్` రిలీజ్ కోసం వేచి చూస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఇది అత‌డికి ఆరంగేట్ర సినిమా కావ‌డంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ద‌శ‌లో ఉంది. ప్ర‌పంచ దేశాల్లో ప‌లు లొకేషన్లలో చిత్రీకరించిన‌ ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క‌థానాయిక‌. శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News