వైట్ డ్రెస్ లో అందాలతో అదరహో అనిపిస్తున్న సోనమ్ కపూర్!

ముఖ్యంగా ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ సోనమ్ కపూర్ ఇచ్చిన ఫోజులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.;

Update: 2025-09-22 22:30 GMT

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తాజాగా లండన్ లో మెరిసింది. ఫ్యాషన్ వీక్ లో భాగంగా తన అందాలతో అక్కడి వారిని మంత్ర మగ్దులను చేసింది. తాజాగా ఫ్యాషన్ వీక్ లో భాగంగా వైట్ కలర్ డ్రెస్ ధరించి స్లీవ్ లెస్ టాప్ ఎద అందాలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. వైట్ కలర్ డ్రెస్ పై అందంగా.. పక్షి ఆకారంలో స్టోన్స్ తో పొదిగిన బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ తో చేసిన డిజైన్ డ్రెస్ కే సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. తాజాగా సోనమ్ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మడి అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

 

ముఖ్యంగా ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ సోనమ్ కపూర్ ఇచ్చిన ఫోజులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ కొంతమంది ఫైర్ ఎమోజీలను పెడుతుంటే.. మరికొంతమంది లవ్ సింబల్స్ షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సోనమ్ కపూర్ లండన్ లో తన అందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పడంలో సందేహం లేదు.

 

సోనమ్ కపూర్ విషయానికి వస్తే.. 1985 జూన్ 9వ తేదీన ముంబై మహారాష్ట్రలో జన్మించింది. ఈమె తండ్రి ఎవరో కాదు ప్రముఖ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ కూతురు. ఈయన దాదాపు 100కు పైగా చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఈమె సింగపూర్ లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్ ఆర్ట్స్ చదువుకుంది. 2005లో సంజయ్ లీల భన్సాలీ దగ్గర సహాయ దర్శకురాలిగా చేరిన ఈమె.. బ్లాక్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ తర్వాత సంజయ్ దర్శకత్వం వహించిన సావరియా అనే సినిమాతో 2007లో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఇందులో ఈమె నటనకు గాను ఉత్తమ నూతన నటి విభాగంలో ఫిలింఫేర్ పురస్కారం కూడా లభించింది.

 

మూడు సంవత్సరాల తర్వాత 2010లో ఐ హేట్ లవ్ స్టోరీస్ సినిమాతో మొదటి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈమె.. వరుసగా ఫ్లాప్ ల తర్వాత 2013లో వచ్చిన రాంఝనా సినిమా సక్సెస్ అవడంతో మళ్లీ ఈమె కెరియర్ గాడిన పడింది అని చెప్పవచ్చు. అలా వరుస సినిమాలలో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ఈమె ఎన్నో బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.

 

సోనం కపూర్ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. 2018లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుంది. 2022 ఆగస్టు 20న మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Tags:    

Similar News