సోనాలి బింద్రే కోసం న్యూయార్క్ వెళ్లిన సల్మాన్!
సోనాలి బింద్రే ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని కెరీర్ కొనసాగింది.;
సోనాలి బింద్రే ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని కెరీర్ కొనసాగింది. అటుపై వివాహం అనంతరం కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది. మళ్లీ 2013 లో కంబ్యాక్ అయింది. కానీ కంటున్యూగా సినిమాలు చేయలే కపోయింది. అందుకు కారణాలు అనేకం అయినా? వ్యక్తిగత జీవితంలో సోనాలి బింద్రే చాలా ఇబ్బందులు పడింది.
మహమ్మారి క్యాన్సర్ బడిన పడటం తో సోనాలి తన రూపాన్నే కోల్పోయింది. తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. క్యాన్సర్ కారణంగా వైద్య చికిత్సల్లో బాగా నలిగిపోయింది. జుట్టు ఊడిపోయింది. రూపం మారిపోయింది. మునుపటి సోనాలిని మళ్లీ చూడగలమా? అని అభిమానులు ఎంతో బాధపడ్డారు. కానీ మహమ్మారిపై గొప్ప పోరాటం చేసి గెలిచింది. మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలు చేయడం మొదలు పెట్టింది.
బాలీవుడ్ లో హ్యాపీ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే సోనాలి బింద్రే క్యాన్సర్ కోసం న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో సల్మాన్ ఖాన్ తనకెంతో భరోసానిచ్చారింది. వైద్యం జరుగుతోన్న సమయంలో రెండుసార్లు న్యూయార్క్ వెళ్లి చూసొచ్చారట సల్మాన్. ఎప్పటికప్పుడు డాక్టర్లకు పోన్ చేసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకునే వారని తెలిపింది. ఆయన ఓదార్పు తనకెంతో ధైర్యాన్ని అందించిందని తెలిపింది.
1999లో రిలీజ్ అయిన 'హమ్ సాత్ సాత్ హై' సినిమాలో సోనాలి బింద్రే- సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే సల్మాన్ ఖాన్ పై విమర్శలు చేసింది సోనాలి. షూటింగ్ సయంలో సల్మాన్ ఖాన్ తనను చూసి ముఖం చిట్లించేవాడని, అది చూసి తనకు విపరీతమైన కోపం వచ్చేదని మండిపడింది. తను నచ్చే వాడు కాదని అప్పట్లో వ్యాఖ్యానించింది.