అప్పుడు స్టార్ కిడ్స్... ఇప్పుడు సోషల్ మీడియా కిడ్స్
సినిమా ఇండస్ట్రీ పూర్తిగా వారసత్వం పై నడుస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు.;
సినిమా ఇండస్ట్రీ పూర్తిగా వారసత్వం పై నడుస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఏ భాష సినిమా ఇండస్ట్రీలో అయినా ఎక్కువగా వారసులే ఉన్నారు... ఆ విషయం కాదనలేని వాస్తవం. కానీ అతి కొద్ది మంది మాత్రం తమ సొంత ప్రతిభతో ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో కొందరు సక్సెస్ అవుతుంటే మరికొందరు రెండు మూడు సినిమాలతోనే కనుమరుగవుతున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకోవడం అనేది అంతా సులభమైన విషయం కాదు. స్టార్ హీరోల కొడుకులు లేదా బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే ఇండస్ట్రీలో మంచి ఎంట్రీ దక్కుతుంది అనేది గత రెండు దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు యంగ్ స్టార్ హీరోల్లో ఎక్కువ శాతం మంది వారసులు ఉన్నారు. వారసత్వంతో వచ్చినంత మాత్రాన సక్సెస్ అవుతారన్న నమ్మకం లేదు, వారసులుగా వచ్చిన వారికి ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. వారసత్వంతో వచ్చిన వారు చాలా మంది ఇప్పటికీ సక్సెస్ లేక కింద మీద పడుతున్నారు.
మిస్టర్ భారత్ సినిమాతో...
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారు హీరోలుగా హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో పరిచయమవుతున్నారు. కేవలం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల కారణంగా ఏకంగా ప్రభాస్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని ఇమాన్వి దక్కించుకున్న విషయం తెలిసిందే. అలా చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు హీరోలు సైతం అదే దారిలో నడుస్తున్నారు. ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్నవారు యూట్యూబ్లో వీడియోలు చేయడం, షార్ట్ ఫిలిం చేయడం ద్వారా తమ ప్రతిభను చూపిస్తున్నారు. దాంతో ఇండస్ట్రీ నుంచి ఆహ్వానం లభిస్తోంది. తెలుగులో ఒకరిద్దరూ ఇప్పటికే యూట్యూబ్ ద్వారా వచ్చి స్టార్స్ గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. హీరోగా తెలుగు యూట్యూబర్స్ కి ఎక్కువ ఛాన్స్ రాకపోవచ్చు కానీ ఒక తమిళ యూట్యూబర్ ఏకంగా భవిష్యత్తు స్టార్ హీరో అనే పేరును సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
ఫైనల్లీ అని యూట్యూబ్ ఛానల్...
తమిళనాడుకు చెందిన భారత్ అనే కుర్రాడు ఫైనల్లీ అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. చాలా తక్కువ సమయంలోనే ఆ యూట్యూబ్ ఛానల్ కి మంచి పేరు వచ్చింది, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా భారత్ విభిన్నమైన కంటెంట్ అందించడం మొదలుపెట్టాడు. దాంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు చేయడం, సెలబ్రిటీలతో చిట్ చాట్ చేయడం వంటివి చేసేవాడు. తద్వారా ఇండస్ట్రీకి దగ్గర అయ్యాడు. భారత్ హీరోగా ఇటీవలే ఒక సినిమా మొదలైంది. ఆ సినిమా పూర్తికాకుండానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. తన మొదటి సినిమా మిస్టర్ భారత్ షూటింగ్ దశలో ఉండగానే రెండు మూడు సినిమాలకు సైన్ చేయడం ద్వారా ఈ కుర్రాడు తమిళ సినిమా వర్గాల వారిని సర్ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతడు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో కోలీవుడ్ కి ఒక మంచి స్టార్ గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతడి జోరు చూస్తూ ఉంటే భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలని వెనక్కి నెట్టిన ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది.
కోలీవుడ్ లో రాబోయే తరానికి స్టార్ హీరో
భారత్ ఇప్పటికే మిస్టర్ భారత్ సినిమాను చేస్తున్న నేపథ్యంలో పలువురు ఆయనతో సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూత్లో యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా భారత్ ఏ ప్రాజెక్ట్ చేసిన తప్పకుండా విజయం సాధిస్తుంది అనే విశ్వాసం ను నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దర్శకులు సైతం తమ కథలకు భారత్ సరైన న్యాయం చేస్తాడు అనుకుంటే వెంటనే ఆయన్ని సంప్రదిస్తున్నారు. భారత్ సైతం తన వద్దకు వచ్చిన ఆఫర్లను వదులుకోకుండా కథ బాగుంటే తప్పకుండా చేస్తాను అన్నట్లుగా దర్శకులకు నిర్మాతలకు హింట్ ఇస్తున్నాడు. దాంతో అతడిని సంప్రదించేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద అతడి ప్రభావం ఏ మేరకు ఉంటుందా అని కొంతమంది నిర్మాతలు వేచి చూస్తున్నారు. మిస్టర్ భారత్ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా భారత్ కోలీవుడ్లో స్టార్ హీరోల సరసన నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్ హీరోగా సక్సెస్ అయితే భవిష్యత్తులో స్టార్ కిడ్స్ కి మాత్రమే కాకుండా యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న వారికి కూడా ఇండస్ట్రీలో సాలిడ్ ఎంట్రీ దక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకే స్టార్ కిడ్స్ కి మాత్రమే కాకుండా సోషల్ మీడియా కిడ్స్ కి కూడా ఇకముందు ఇండస్ట్రీలో అవకాశాలు సమానంగా ఉండే అవకాశం ఉందని అంచన.